Osey Ramulamma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Osey Ramulamma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, డిసెంబర్ 2021, శనివారం

Osey Ramulamma : Erupu Rangu (ఎరుపు రంగు )

చిత్రం: ఒసేయ్ రాములమ్మ(1998 )

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: దాసరి నారాయణ రావు

గానం:కె.యస్.చిత్ర


ఎరుపు రంగు యెడ ఉంటే ఆడే ఉంటా-నంటివి అడవి తల్లికి కన్న తల్లికి కన్ను రెప్పవైతివి 
నెత్తురు పత్థఇల్లుగా ఏ నేల మీద పడి ఉంటివి నెత్తురు పత్థఇల్లుగా ఏ నేల మీద పడి ఉంటివి ఓ... ఓ... ఓ.ఓ. 
ఉద్యమం ఎలా బాలుడా. వీరుడా అభిమన్యుడా ఉద్యమం ఎలా బాలుడా వీరుడా అభిమన్యుడు ఆడి పాడే వయసులో ఏ పాడు కడుపునా పుట్టినావు బిడ్డ ఉన్న బిడ్డ లేని గొడ్డు రాలిని చేసినావు
అమ్మనయ్యా నీకు-నేనను నిమిషంలో. కన్నుమిస్తివి ఓ... ఓ... ఓ
ఉద్యమం ఎలా బాలుడా. వీరుడా అభిమన్యుడు ఉద్యమం ఎలా బాలుడా వీరుడా అభిమన్యుడు తల్లి పాలను తప్పలేదు ఒడిలో నిన్ను ఊపలేదు చందమామను చూపిపాడే
లాలి పాటలు పాడలేదు పట్టెడన్నం పెట్టకున్న మట్టి వేసి కప్పుతున్న ఓ... ఓ... ఓ
ఉద్యమం ఎలా బాలుడా. వీరుడా అభిమన్యుడు ఉద్యమం ఎలా బాలుడా వీరుడా అభిమన్యుడు ఎర్ర జండాలో చూసుకుంటే ఎర్రని జండాలో చూసుకుంటా వేడి నెత్థుటి ఎరుపు లో
నీ జాడలే కనిపించునంటే కత్త్తి-తోనే కడుపుపైన ఆణువణువూ. కోసుకుంటే ఓ... ఓ... ఓ…
ఉద్యమం ఎలా బాలుడా. వీరుడా అభిమన్యుడు ఉద్యమం ఎలా బాలుడా వీరుడా అభిమన్యుడు ఉద్యమం ఎలా బాలుడా వీరుడా అభిమన్యుడు


14, ఆగస్టు 2021, శనివారం

Osey Ramulamma : Ramsakkani Talli Song Lyrics (రామసక్కని తల్లి )

చిత్రం : ఒసేయ్ రాములమ్మ (1997)

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గానం : కీరవాణి, శ్రీలేఖ
గీత రచయిత : సుద్దాల అశోక్ తేజ


రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ తాసుపాములు కరిసే ఇసుమంటి తావుల్లా భూతాలు దెయ్యాలు తిరిగేటి గడియల్ల ఎండిన సెట్టుకు రాలిన ఆకోలే ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ ఎక్కెక్కి ఎడ్సేవు ఎందుకమ్మో ఎందుకమ్మా ఎట్లా సెప్పుదునయ్య నా బాధను నా నోటితో ఏమని సెప్పేది నా గోడును నా తండ్రితో దెయ్యాలు ముట్టిన ఫలమయ్యిపోతిని కన్నతల్లికి నేను బరువయ్యిపోతిని నలుగురిలో నీకు నల్ల మొగము చేసి ఆడపోరిగా నేను పుడితినయ్యో పుడితినయ్యా అడవిలో మానయ్యి పోతానయ్యో పోతానయ్యా రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ తెలుపేదో నలుపేదో తెలువని తల్లివి బతుకు శాపమైన బంగారు తల్లివి నిన్ను కొట్టిన తల్లి కన్నీరు పెడుతుంది నన్ను తల్లనుకొని రాములమ్మో రాములమ్మ ఉన్న ముచ్చట చెప్పు రాములమ్మో రాములమ్మా రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ పటువారి దొరగారు అరిటాకులో నాకు పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న ఆడుకొమ్మని నాకు ఆటబొమ్మలిస్తే దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న జాలితోటి నాకు జామపండు ఇచ్చి తల మీద శెయ్యి పెడితే తండ్రి లెక్కనుకున్నా ఎండి గిన్నెల పాలు పోసి నాకిస్తుంటే దండి గుణము చూసి దండాలు పెట్టిన కాటు వేసేదాకా తెలవదయ్య నాకు కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది కొరగాని బతుకయ్యి పోయిందయ్యో పోయిందయ్యా కొరివి పెట్టి సాగనంపాలయ్యో సంపాలయ్య ఎన్నుపూసల నుంచి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు ఎన్నడెరుగని నొప్పి ఎందులకీ నొప్పి ఈ బాధ నకెందుకొచ్చిందయ్యో వచ్చిందయ్యా ఈ జన్మ నాకెందుకిస్తివయ్యో ఇస్తివయ్యా పాపమెవ్వరిదైనా పాప పుట్టే నొప్పి పురిటి తల్లికి నొప్పి పుడమి తల్లికి నొప్పి ఆడదాని పేగు మీద రాసిన నెప్పి తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ

Osey Ramulamma : Ye Ashurudu Song Lyrics (ఏ అసురుడు సృస్టించిన పంచమ తంత్రం)

చిత్రం: ఒసేయ్ రాములమ్మ(1998 )

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం:వందేమాతరం శ్రీనివాస్ 



పవిత్రాణాయ సాధూనాం ఆవిరి కుప్పం విధ్వంసం వినాశాయ చదుష్క్రుతాం నీరుకొండ అమానుషం ధర్మ సంస్థాపనార్ధాయ ధరణి కోట దానవత్వం సంభవామి యుగే యుగే దళిత మనవ నాశనార్ధం ఏ అసురుడు సృస్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచించిన దారుణ కులమంత్రం నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటనవేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతీ చోట మహా రక్త క్షేత్రం అడగండోయ్ అరవండోయ్ మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదీస్తూ అడగండోయ్ పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండోయ్ మీరు అడగండోయ్ నరమేధపు మహారధం గుండెలపై నడచినా నలిగిన పేదరికం చితికి చిధ్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరినా అసహాయుల ఘోషతో దిశలు మరు మ్రోగినా కళ్ళుండి చెవులుండి కనని వినని కారకులను అడగండోయ్ పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండోయ్ తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతుంది గళమెత్తిన ధైన్యంలో జనం కుమిలిపోతుంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ళ కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్టం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక వద్దని అరవండోయ్ పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండోయ్ అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఏ నాటికీ ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షకభట వర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధనస్వామ్యం ఇక తప్పదు ప్రతి ఒకడు ఒక ఉరుమై ఒక మెరుపై పిలవండోయ్ మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదీస్తూ అడగండోయ్ పంచముణ్ణి సృష్టించిన ఆ వంచన తల తెంచగ కదలండో..మీరు గెలవండో....

Osey Ramulamma : Rammullamma Oo Rammullamma Song Lyrics (రాములమ్మ ఓ రాములమ్మ)

చిత్రం: ఒసేయ్ రాములమ్మ(1998 )

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం:వందేమాతరం శ్రీనివాస్ 



తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగు వన్నాడు నల్లవాడు నేడు నిన్ను నక్సలైటు అన్నాడు ఎల్లవారు రేపు మనల వేగుచుక్కలంటారు రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా గుండె నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మా రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు వీరమాత కంట తడిని పుడమితల్లి చూడలేదు కన్నీళ్ళతో నీవు కూడ గమ్యాలను చూడలేవు నేనున్నా... లేకున్నా... నేనున్నా లేకున్నా ఎవరేమైపోతున్నా చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా నేను చచ్చిపోతున్నా... రేపే డప్పై పుడతా... నీ ప్రస్థానానికి నే... విప్లవాల దరువవుతా... కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే కమిలే నా కనుపాపలు చూపై నీతో ఉంటయ్ నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా విప్లవమా... వర్ధిల్లు... విప్లవమా వర్దిల్లని వీధి వీధి నినదిస్తా... చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా భగత్-సింగునురిదీస్తే తిరుగుబాటు ఆగిందా సద్దర్ హష్మిని నరికితే పాట మూగబోయిందా ఆగదు మన రగల్జండ పోరాటం ఉప్పెనలా పొంగుతున్న జన తీర్ధం రావద్దు... నాకోసం... రావద్దు నాకోసం బలి కావొద్దు చలో బెహన్ ... కరో జంగ్... ఆజాది చలో బెహన్ ... కరో జంగ్... ఆజాది చలో బెహన్ ... కరో జంగ్... ఆజాది

Osey Ramulamma : Oo Chowdary Garu Song Lyrics (అ చౌదరి గారు, ఓ నాయుడు గారు)

చిత్రం: ఒసేయ్ రాములమ్మ(1998 )

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: సుబ్బారావు గంధవరపు 

గానం:వందేమాతరం శ్రీనివాస్ 



అ చౌదరి గారు, ఓ నాయుడు గారు రెడ్డీ గారు, ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు (చౌదరి గారు, ఓ నాయుడు గారు రెడ్డీ గారు, ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు) Donationల యుగములోన డబ్బు లేని దళితుల్లో వందకొకడు చదువుతుంటే ఓర్చుకోని గుణమెందుకు (ఓర్చుకోని గుణమెందుకు) అరె లంచగొండి దేశంలో ఎనకబడ్డ జాతుల్లో వెయ్యికోకడు నౌకరైతే ఎడ్చుకొనే బుద్ధేందుకు (ఎడ్చుకొనే బుద్ధేందుకు) పాయసాల జీడిపప్పు తినేవాళ్లకి సామీ (పాయసాల జీడిపప్పు తినేవాళ్లకి) మా గంజిలోన ఉప్పుజూసి గొణుగుడెందుకూ చౌదరి గారు, ఓ నాయుడు గారు రెడ్డీ గారు, ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు పల్లెటూళ్ల సర్పంచుల పట్టణాల chairmanల సగం నీకే ఇస్తమని సంకలెగర వెయ్యమన్రు (సంకలెగర వెయ్యమన్రు) శాసనసభ సభ్యుల్లో parliament-u memberలు అర కోర seat-uలిచ్చి ice-u జేసి పోతన్రు (Ice-u జేసి పోతున్రు) Power-u లేని పడవికుండె reservation-u (Power-u లేని పడవికుండె reservation-u) ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు గా ముఖ్యమంత్రి పడవికైన ఎందుకుండదు సామీ (చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డీ గారు ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు) పండుతున్న భూముల్లో ఎనభై శాతం మీవే Millల్లో మిషనుల్లో మూడొంతులు మీ కిందే (మూడొంతులు మీ కిందే) అరె రూపాయ కట్టలన్ని మీ ఇనప పెట్టెలందే బంగారం వెండంత మీ మెడకే మీ కాళ్లకే (మీ మెడకే మీ కాళ్లకే) ఎనభై శాతం మంది ఎండుకొని చస్తుంటే ఇరవై శాతం మీరు దండుకొని బతుకుతున్రు (దండుకొని బతుకుతున్రు) మా చదువులు మా కొలువులు మీకు ఇస్తము (మా చదువులు మా కొలువులు మీకు ఇస్తము) మీ సంపదలో reservation మాకు ఇస్తరా (చౌదరి గారు, ఓ నాయుడు గారు రెడ్డీ గారు, ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు) మీ అబ్బ పేరేమో సుబ్బారావు గారైతే మా అయ్యా పేరేమో సుబ్బిగాడు ఐపోయే (సుబ్బిగాడు ఐపోయే) మీ అన్న గారేమో విమానాల్లో ఎక్కుతుంటే మా తమ్ముడు గాడేమో రిక్షాలు తొక్కుతుండె (రిక్షాలు తొక్కుతుండె) మీ అమ్మకు జలుబొస్తే అపొలోలో జేరుతుంటే మా తల్లికి కేన్సరైతే ఆకు పసరు మింగుతుండే (ఆకు పసరు మింగుతుండే) మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదమంటే (మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదమంటే) దేవుళ్లలో ఒకడైన దళితుడే లేకపాయే చౌదరి గారు, ఓ నాయుడు గారు ఆ రెడ్డీ గారు, ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు (చౌదరి గారు, ఓ నాయుడు గారు రెడ్డీ గారు, ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు)