చిత్రం : పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం: కే. చక్రవర్తి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
సాహిత్యం: వేటూరి
ఆ..ఆ..ఆ..ఆ... కట్టు కధలు సెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మా మల్లి నవ్వాలా పకపకా మళ్ళి మళ్ళి నవ్వాలా పకపకా కట్టు కధలు సెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మా మల్లి నవ్వాలా పకపకా మళ్ళి మళ్ళి నవ్వాలా పక పకా అనగనగనగా ఒక అల్లరి పిల్లోడు ఒకనాడాపిల్లాడ్ని సీమ కుట్టింది.. సీమ కుట్టి సిన్నోడు ఏడుస్తుంటే సీమ సీమ ఎందుకు నువ్వు కుట్టావంటే సీమ కుట్టి సిన్నోడు ఏడుస్తుంటే సీమ సీమ ఎందుకు నువ్వు కుట్టావంటే పుట్టలో ఏలెడితే కుట్టనా నా పుట్టలో ఏలెడితే కుట్టనా నేను కుట్టనా అంట కుట్టనా అన్నది అది విన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు అది విన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు కుయ్యో మొర్రో... కుయ్యో మొర్రో..కుయ్యో మొర్రో.. కట్టు కధలు సెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మా మల్లి నవ్వాలా పకపకా మళ్ళి మళ్ళి నవ్వాలా పకపకా పల్నాటి పడుచు పిల్ల కోటి పల్లి రేవు దాటి బంగారి మావకోసం... గోంగూర చేనుకొస్తే ఆ........ ఆ..ఆ..ఆ..... ఎన్నెలాంటి నా వోడు సెందురూడా ఎండదెబ్బ తీసాడు సెందురూడా బుగ్గమీద నా వోడు సెందురూడా ముద్దరేసి పోయాడు సెందురూడా పోయినోడు పోకుండా రాత్రే నా కల్లో కొచ్చాడు సిన్న నాటి ముచ్చటే సిలక పచ్చనా ఒక నాటి మాటైనా నూరేళ్ల ముచ్చట నూరేళ్ళ ముచ్చట హ..హ..హ నీలాటి రేవులో నీడల రాగం సాకిరేవులో ఉతుకుడు తాళం నీలాటి రేవులో నీడల రాగం సాకిరేవులో ఉతుకుడు తాళం తదరిన తా తదరిన తా ఆఆఆ……ఆఆఆ…. తదరిన తదరిన తదరిన తదరిన(హ..హ..హ) తదరిన తదరిన తదరిన (హ..హ..హ) ఆఆఆ....ఆఆఆ....(హ..హ..హ)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి