10, ఆగస్టు 2021, మంగళవారం

Padaharella Vayasu : Panta Chenu Paala kanki navvindi Song Lyrics (పంటచేలో పాలకంకి నవ్విందీ)

చిత్రం : పదహారేళ్ళ వయసు (1978)

సంగీతం: కే. చక్రవర్తి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సాహిత్యం: వేటూరి



అతడు:

పంటచేలో పాలకంకి నవ్విందీ  పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ  పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా  లేతపచ్చ కోనసీమ ఎండల్లా  అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే  గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే ॥॥

పంటచేలో పాలకంకి నవ్విందీ  పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ

 చరణం : 1  ఆమె: శివ గంగ తిరనాళ్లలో    నెలవంక స్నానాలు చెయ్యాలా  చిలకమ్మ పిడికిళ్లతో    గొరవంక గుడిగంట కొట్టాలా  అ: నువ్వు కంటి సైగ చెయ్యాలా  నే కొండ పిండి కొట్టాలా  మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా    (2)  ఆ నవ్వుకే  ఈ నాపచేను పండాలా ॥॥  చరణం : 2  ఆ: గోదారి పరవళ్లలో    మా పైరు బంగారు పండాలా  ఈ కుప్ప నూర్పిళ్లతో మా ఇళ్లు వాకిళ్లు నిండాలా  అ: నీ మాట బాట కావాలా    నా పాట ఊరు దాటాలా  మల్లిచూపే పొద్దుపొడుపై పోవాలా     (2)  ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా ॥॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి