2, ఆగస్టు 2021, సోమవారం

Pelli Sandadi : Hrudayamane Song Lyrcis (హృదయమనే కోవెల)

 

చిత్రం : పెళ్లి సందడి సంగీతం: M.M.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



హా హా హా హా హ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ... త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ గగనానికి నేలకు వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ ... హృదయమనే కోవెలు తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఇవ్వటమే నేర్పగల ఈ ప్రేమ తనకొరకు ఏ సిరిని అడగదు కదా నవ్వటమే చూపగల ఈ ప్రేమ మంటలనె వెన్నెలగ మార్చును కదా గాలికి గంధము పూయటమే పూలకు తెలిసిన ప్రేమసుధ రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమకథ ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి మురిసేటి గుణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ ... హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఏ జతనో ఎందుకో విడదీసి వెంటాడి వేటాడు ఆటే ప్రేమ మౌనముతో మనసునే శృతి చేసి రాగాలు పలికించు పాటే ప్రేమ శాశ్వత చరితల ఈ ప్రేమ మృత్యువు ఎరుగని చిరునామా శ్వాసను మంగళహారతిగా వెలిగించేదే ఈ ప్రేమ మరణాన్ని ఎదిరించి మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి కరుణించు వరమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి