13, ఆగస్టు 2021, శుక్రవారం

Premaku Velayara : Ippatikippudu Reppalo Song Lyrics (ఇప్పటికిప్పుడు రెప్పల్లో..)

చిత్రం: ప్రేమకు వెళ్లాయెరా  (1994 )

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: పి. ఉన్నికృష్ణన్ , కె.యస్.చిత్ర



ఇప్పటికిప్పుడు రెప్పల్లో... ఎన్నెన్ని కలల ఉప్పెన్లో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్లో మనసుని మేలుకొమ్మని కదిపి కుదిపే సరదాల సందడి ప్రేమకి వేళయిందని తరిమి తడిమే తరుణాల తాకిడి ఏం చేయమంది కొంటె అల్లరి ఆ మాట చెప్పదు ఎలా మరి మాటలేవి వద్దు చేరుకోమని చిలికి చిలికి ఉలికిపడే చిలిపి వలపు చినుకు సడి ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెన్లో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్లో సరసకు చేరలేదు ఇన్నాళ్ళు అలజడి రేపుతున్న తొందరలు పరిచయమైన లేదు ఏనాడు శిరసును వంచమన్న బిడియాలు సరదాగా మొదలైన శృతి మించే ఆటలో నను నేనే మరిచానా మురిపించే ముద్దులో ఏమైనా ఈ మాయ బాగుందిగా ఆకాశ మార్గాన సాగిందిగా ముడిపడి వీడనంది నూరేళ్ళ సంకెల ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెన్లో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్లో కనపడలేదు మునుపు ఏనాడు కనులకు ఇన్ని వేల వర్ణాలు తెలియనే లేదు నాకు ఏనాడు తలపును గిల్లుతున్న వైనాలు పెదవుల్లో విరబూసే చిరు నవ్వుల కాంతిలో ప్రతి చోట చూస్తున్నా ఎన్నెన్ని వింతలో తొలిసారి తెలవారి నీ ఈడుకి గిలిగింత కలిగింది ఈ నాటికి జతపడి సాగమంది కౌగిళ్ళ వాడకి ఇప్పటికిప్పుడు రెప్పల్లో... ఎన్నెన్ని కలల ఉప్పెన్లో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్లో మనసుని మేలుకొమ్మని కదిపి కుదిపే సరదాల సందడి ప్రేమకి వేళయిందని తరిమి తడిమే తరుణాల తాకిడి ఏం చేయమంది కొంటె అల్లరి ఆ మాట చెప్పదు ఎలా మరి మాటలేవి వద్దు చేరుకోమని చిలికి చిలికి ఉలికిపడే చిలిపి వలపు చినుకు సడి ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెన్లో ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్లో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి