13, ఆగస్టు 2021, శుక్రవారం

Erra Mallelu : Nampally Station Kada Raaja Lingo Song lyrics (నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో)

చిత్రం:  ఎర్ర మల్లెలు (1981)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం:  సి.నారాయణరెడ్డి

గానం: ఎస్ పి శైలజ



పల్లవి : నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో... రాజాలింగా రామారాజ్యం తీరు సూడు... శివా శంభు లింగా... లింగా రామారాజ్యం తీరు సూడు... శివా శంభు లింగా... లింగా నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో... రాజాలింగా చరణం : 1 తిందామంటే తిండీలేదు... ఉందామంటే ఇల్లేలేదు తిందామంటే తిండీలేదు... ఉందామంటే ఇల్లేలేదు చేదామంటే కొలువు లేదు... పోదామంటే నెలవు లేదు నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో... రాజాలింగా రామారాజ్యం తీరు సూడు... శివా శంభు లింగా... లింగా రామారాజ్యం తీరు సూడు... శివా శంభు లింగా... చరణం : 2 గుక్కెడు గంజి కరువైపాయే... బక్కటి ప్రాణం బరువైపాయే గుక్కెడు గంజి కరువైపాయే... బక్కటి ప్రాణం బరువైపాయే బీదబిక్కి పొట్టలు గొట్టి... మేడలు గట్టె సీకటి శెట్టి నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో... రాజాలింగా రామారాజ్యం తీరు సూడు... శివా శంభు లింగా... లింగా రామారాజ్యం తీరు సూడు... శివా శంభు లింగా... చరణం : 3 లేని అమ్మది అతుకుల బతుకు... ఉన్న బొమ్మకి అందం ఎరువు లేని అమ్మది అతుకుల బతుకు... ఉన్న బొమ్మకి అందం ఎరువు కారల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో... రాజాలింగా రామారాజ్యం తీరు సూడు... శివా శంభు లింగా... లింగా రామారాజ్యం తీరు సూడు... శివా శంభు లింగా... చరణం : 4 ముందు మొక్కులు ఎనక తప్పులు... ఉన్నవాడికే అన్నీ చెల్లును ముందు మొక్కులు ఎనక తప్పులు... ఉన్నవాడికే అన్నీ చెల్లును ఉలకావేమి పలకావేమి... బండారాయిగ మారిన సామి నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో... రాజాలింగా రామారాజ్యం తీరు సూడు... శివా శంభు లింగా... లింగా రామారాజ్యం తీరు సూడు... శివా శంభు లింగా... లింగా రామారాజ్యం తీరు సూడు... శివా శంభు లింగా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి