13, ఆగస్టు 2021, శుక్రవారం

Pushpa : Daakko Daakko Meka Song Lyrics ( హే దాక్కో దాక్కో మేక)

చిత్రం: పుష్ప(2021)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం:  చంద్రబోస్

గానం:శివమ్ 


తందానే.. తాన తందానానేనా..

తందానే.. తాన తందానానేనా. తానాని తనినరీనానే.. అ.. అ.. అ.. అఅఅ.. వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక.. మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి.. అ.. అ.. అ.. అఅఅ.. పులినే తింటది చావు.. చావును తింటది కాలం.. కాలాన్ని తింటది ఖాళీ.. ఇది మహా ఆకలి.. అ.. అ.. అ.. అఅఅ.. వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి.. దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది.. ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే.. హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక.. చాపకు పురుగు ఎరా.. పిట్టకు నూకలు ఎరా.. కుక్కకు మాంసం ముక్క ఎరా.. మనుషులందరికీ బతుకే ఎరా.. గంగమ్మ తల్లి జాతర.. కోళ్లు పొట్టేళ్ళు కోతరా.. కత్తికి నెత్తుటి పూతర.. దేవతకైనా తప్పదు ఎరా.. ఇది లోకం తలరాతరా.. అ.. అ.. అ.. అఅఅ.. ఏమరపాటుగా ఉన్నావా.. ఎరకే చిక్కేస్తావు.. ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు.. కాలే కడుపు సూడదురో నీతి న్యాయం.. బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టారాజ్యం.. హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక.. అడిగితే పుట్టదు అరువు.. బతిమాలితే బతుకే బరువు.. కొట్టర ఉండదు కరువు.. దేవుడికైనా దెబ్బే గురువు.. తన్నులు సేసే మేలు.. తమ్ముడు కూడా సెయ్యడు.. గుద్దుడు సెప్పే పాఠం.. బుద్ధుడు కూడా సెప్పడహే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి