Pushpa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pushpa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, డిసెంబర్ 2021, సోమవారం

Pushpa : Eyy Bidda Idhi Naa Adda Song Lyrics (ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా )

చిత్రం: పుష్ప (2021)

రచన: చంద్రబోస్

గానం: నకాష్ అజిజ్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టేటోడు భూమ్మీదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నను మించి ఎదిగెటోడు ఇంకోడున్నాడు సూడు ఎవడంటే అది రేపటి నేనే నే తిప్పాన మీసమట సేతిలోన గొడ్డలట సేసిందే యుద్ధమట సెయ్యందే సంధి అటా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ, ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ, ఇది నా అడ్డా అరె, ఏయ్ బిడ్డ, ఇది నా అడ్డా నిను ఏట్లో ఇసిరేస్తా నే సేపతో తిరిగొస్తా గడ కర్రకు కుచ్చేస్తా నే జెండాల ఎగిరేస్తా నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా నే ఖరీదైన ఖనిజంలా టెన్ టు ఫైవ్ మళ్ళీ దొరికేస్తా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా అరె, ఏయ్ బిడ్డ… ఇది నా అడ్డా ఎవడ్రా ఎవడ్రా నువ్వు..? ఇనుమును ఇనుమును నేను నను కాల్చితే కత్తౌతాను ఎవడ్రా ఎవడ్రా నువ్వు..? మట్టిని మట్టిని నేను నను తొక్కితే ఇటుకౌతాను ఎవడ్రా ఎవడ్రా నువ్వు..? రాయిని రాయిని నేను గాయం గాని చేశారంటే ఖాయంగా దేవున్నౌతాను ఏయ్ బిడ్డ, ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ, ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ, ఇది నా అడ్డా లే లే తగ్గేదే లే అరె, ఏయ్ బిడ్డ, ఇది నా అడ్డా లే లే తగ్గేదే లే

5, నవంబర్ 2021, శుక్రవారం

Pushpa : Saami Saami Song Lyrics (సామి నా సామి)

చిత్రం: పుష్ప (2021)

రచన: చంద్రబోస్

గానం: మౌనిక యాదవ్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


నువ్వు అమ్మి అమ్మి అంటంటే నీ పెళ్ళానై పోయినట్టుందిరా సామి నా సామి నిన్ను సామి సామి నా పెనెవిటి లెక్క సక్కంగుందిరా సామి నా సామి నీ ఎనుకే ఎనుకే అడుగేస్తాంటే నీ ఎనుకే ఎనుకే అడుగేస్తాంటే ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి నీ పక్కా పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి నువ్వెళ్ళే దారే సుత్తా ఉంటె ఏరే ఎండినట్టుందిరా సామి నా సామి సామి రారా సామి బంగరు సామి మీసాల సామి రోషాల సామి నా సామి సామి రారా సామి బంగరు సామి మీసాల సామి రోషాల సామి పిక్కల పై దాకా పంచెను ఎత్తే కడితే పిక్కల పై దాకా పంచెను ఎత్తే కడితే నా పంచ ప్రాణాలు పోయెను సామి కార కిల్లి నువ్వు కసకస నములుతుంటే నా ఒళ్ళు ఎర్రగా పండెను సామి నీ అరుపులు కేకలు వింటావుంటే ఏ… నీ అరుపులు కేకలు వింటావుంటే పులకరింపులే సామి నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామి రెండు గుండీలు ఇప్పి గుండెను సూపితే పాలకుండ లెక్క పొంగిపోతా సామి నా సామి నా సామి సామి రారా సామి బంగరు సామి మీసాల సామి రోషాల సామి నా సామి సామి రారా సామి బంగరు సామి మీసాల సామి రోషాల సామి కొత్త చీర కట్టుకుంటే ఎట్టా ఉందొ చెప్పకుంటే కొత్త చీర కట్టుకుంటే ఎట్టా ఉందొ చెప్పకుంటే కొన్న విలువ సున్నా అవదా సామి కొప్పులోన పూలు పెడితే గుప్పున నువ్వే పీల్చకుంటే పులగుండె రాలి పడదా సామి నా కొంగే జారేటప్పుడు నువ్వు… ఆ… నా కొంగే జారేటప్పుడు నువ్వే సూడకుంటే సామి ఆ కొంటె గాలే జాలే పడదా సామి నా అందం చందం నీదవ్వకుంటే ఆడ పుట్టుకే బీడయిపోదా సామి నా సామి నా సామి సామి రారా సామి బంగరు సామి మీసాల సామి రోషాల సామి నా సామి సామి రారా సామి బంగరు సామి మీసాల సామి రోషాల సామి

13, ఆగస్టు 2021, శుక్రవారం

Pushpa : Daakko Daakko Meka Song Lyrics ( హే దాక్కో దాక్కో మేక)

చిత్రం: పుష్ప(2021)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం:  చంద్రబోస్

గానం:శివమ్ 


తందానే.. తాన తందానానేనా..

తందానే.. తాన తందానానేనా. తానాని తనినరీనానే.. అ.. అ.. అ.. అఅఅ.. వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక.. మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి.. అ.. అ.. అ.. అఅఅ.. పులినే తింటది చావు.. చావును తింటది కాలం.. కాలాన్ని తింటది ఖాళీ.. ఇది మహా ఆకలి.. అ.. అ.. అ.. అఅఅ.. వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి.. దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది.. ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే.. హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక.. చాపకు పురుగు ఎరా.. పిట్టకు నూకలు ఎరా.. కుక్కకు మాంసం ముక్క ఎరా.. మనుషులందరికీ బతుకే ఎరా.. గంగమ్మ తల్లి జాతర.. కోళ్లు పొట్టేళ్ళు కోతరా.. కత్తికి నెత్తుటి పూతర.. దేవతకైనా తప్పదు ఎరా.. ఇది లోకం తలరాతరా.. అ.. అ.. అ.. అఅఅ.. ఏమరపాటుగా ఉన్నావా.. ఎరకే చిక్కేస్తావు.. ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు.. కాలే కడుపు సూడదురో నీతి న్యాయం.. బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టారాజ్యం.. హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక.. అడిగితే పుట్టదు అరువు.. బతిమాలితే బతుకే బరువు.. కొట్టర ఉండదు కరువు.. దేవుడికైనా దెబ్బే గురువు.. తన్నులు సేసే మేలు.. తమ్ముడు కూడా సెయ్యడు.. గుద్దుడు సెప్పే పాఠం.. బుద్ధుడు కూడా సెప్పడహే