18, ఆగస్టు 2021, బుధవారం

Rakshasudu : Nee Meeda Naaku Song Lyrics (నీ మీద నాకు ఇదయ్యో..)

చిత్రం : రాక్షసుడు (1986)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి


పల్లవి : నీ మీద నాకు ఇదయ్యో.. అందం నే దాచలేను పదయ్యో.. గిజిగాడి గిచ్చుళ్ళాయే... చలిగాలి చిచ్చాయే చేయించు తొలి మర్యాద... యా యా యా యా నీ మీద నాకు అదమ్మో.. పందెం నీ అంతు చూస్తా పదమ్మో... నీ కళ్ళు కవ్విస్తుంటే .. ఆకళ్ళు మోపాయే చేస్తాను తొలి మర్యాదా... యా యా యా యా నీ మీద నాకు ఇదయ్యో.. పందెం నీ అంతు చూస్తా పదమ్మో... చరణం 1 : నీ వంటి మగమహరాజే మగడే ఐతే... నా వంటి కాంతామణికి బ్రతుకే హాయి... నీ వంటి భామామణులు దొరికే వరకే.. ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి.. నీ వీర శృంగారాలే..ఏ..ఏ.. నీ వీర శృంగారాలే.... చూపించవా ఒకసారి ఒడి చేరి నీ మీద నాకు అదమ్మో.. అందం నే దాచలేను పదయ్యో.. చరణం 2 : నీ చాటు సరసం చూసి గుబులే కలిగే... నీ నాటు వరసే చూసి వలపే పెరిగే... నీ చేతి వాటం చూసి ఎదలే అదిరే.. నీ లేత మీసం చూసి వయసే వలచే.. నీ ముద్దమందారాలే..ఏ..ఏ... నీ ముద్దమందారాలే ... ముద్దాడనా ప్రతి రేయి... జత చేరి... నీ మీద నాకు ఇదయ్యో.. అందం నే దాచలేను పదయ్యో.. నీ కళ్ళు కవ్విస్తుంటే .. ఆకళ్ళు మోపాయే చేస్తాను తొలి మర్యాదా... యా యా యా యా... నీ మీద నాకు ఇదయ్యో.. పందెం నీ అంతు చూస్తా పదమ్మో...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి