చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
పల్లవి :
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
చరణం 1 :
ఊపిరి తగిలిన వేళ .. నీ వొంపులు తిరిగిన వేళ ..
నా వీణ నీ వేణువే.. పలికే రాగమాల
ఆ...ఆ... ల ల లా....ఆ...
సోకులు రగిలిన వేళ ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ ..లో
తనువులో అణువణువున జరిగే రాసలీల
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
నా వీణ నీ వేణువే.. పలికే రాగమాల
ఆ...ఆ... ల ల లా....ఆ...
సోకులు రగిలిన వేళ ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ ..లో
తనువులో అణువణువున జరిగే రాసలీల
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
చరణం 2 :
యెదలో అందం యెదుట .. యెదుటే వలచిన వనిత..
ఆ...ఆ... ల ల లా....ఆ...
కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత ..
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత..
నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత
ఆ...ఆ... ల ల లా....ఆ...
కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత ..
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత..
నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి