11, ఆగస్టు 2021, బుధవారం

Swati Kiranam : Shivani Bhavani Song Lyrics (శివానీ... భవానీ... శర్వాణీ...)

చిత్రం: స్వాతికిరణం(1992)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: శ్రీ కే.వి .మహాదేవన్ గారు



పల్లవి : శివానీ... భవానీ... శర్వాణీ... గిరినందిని శివరంజని భవ భంజని జననీ గిరినందిని శివరంజని భవ భంజని జననీ శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ శివానీ... భవానీ... శర్వాణీ... చరణం : 1 శృంగారం తరంగించు సౌందర్యలహరివని... ఆ.... శృంగారం తరంగించు సౌందర్యలహరివని... ఆ.... శాంతం మూర్తీభవించు శివానందలహరివని... ఆ... శాంతం మూర్తీభవించు శివానందలహరివని... ఆ... కరుణ చిలుకు సిరినగవుల కనకధారవీవనీ నీ దరహాసమే దాసుల దరిజేర్చే దారియని శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ శివానీ... భవానీ... శర్వాణీ... చరణం : 2 రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ భీషణాస్త్ర కేళివనీ... అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావనీ గిరినందిని శివరంజని భవ భంజని జననీ శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ శివానీ... భవానీ... శర్వాణీ...




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి