Swati Kiranam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Swati Kiranam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఆగస్టు 2021, బుధవారం

Swati Kiranam : Jaliga Jabilamma Song Lyrics (జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా)

చిత్రం : స్వాతికిరణం(1992)

రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : వాణి జయరామ్ గారు , కె.యస్.చిత్ర గారు

సంగీతం : శ్రీ కే.వి .మహాదేవన్ గారు




జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా రెప్పవేయనే లేదు ఎందుచేత ఎందుచేత పదహారు కళలని పదిలంగా ఉంచనీ ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత కాటుక కంటినీరు పెదవులనంటనీకు చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచి పెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి కాలకూటము కన్న ఘాటైన గరళమిది గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ

Swati Kiranam : Anathineya Raa Song Lyrics (ఆనతినీయరా హరా)

చిత్రం : స్వాతికిరణం(1992)

రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : వాణి జయరామ్ గారు
సంగీతం : శ్రీ కే.వి .మహాదేవన్ గారు



ఆనతినీయరా హరా ఆనతినీయరా హరా…………. సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా హరా…………. సన్నుతిసేయగా సమ్మతినీయరా……………….. దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా హరా…………………….ఆఆఆఆఆఆఆఆ…………………. నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా ఆనతినీయరా హరా ................. ఆఆఆఆఆఆఆఆఆ……………… ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా………. అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా .......... పమపని పమపని పమపని గమపని సనిసగ సనిసగ సనిసగ పనిసగ గమగ సాని పమ గమగసా సగసని ఆనతినీయరా………. జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా ఆనతినీయరా ............. సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ గసగ గా పమగస గ సనిప నిపమగమగ ఆనతినీయరా శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిగ సేవించుకొందురా…………. ఆనతినీయరా ... పాపా పమప నినిపమగస గగ పాపా పమప నిని పమగస గగ గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ పాపా పమప నినిపమగస గగ గమపని గా,,,,,, మపనిస మా,,,,,,,,, పనిసగ నీస పాని మాప గామ సాగమ పాపా పమప నినిపమగస గగ గమపని గ మపనిస మ పనిసగని గమపని గ మపనిస మ పనిసగ నిస పని మప గమ సాగామ పాపా పమప నినిపమగస గగా………..(ఆఆఆఆఆఆఆ) గామాపని గ మాపానిస మ పానీ సగ నిస పని మప గమ సాగామ పాపా పమప నినిపమగస గగాగ గగ మమ పప నిగ తక తకిట తకధిమి మమ పప నినిసమ తక తకిట తకధిమి పపనినిసస గని తక తకిట తకధిమి పపని మపగమ సగమ పాపా పమప నినిపమగస గగా రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షణా పేక్షిత ప్రతీక్ష నుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా…………… హరా …….………..(ఆఆఆఆఆఆఆ) ఆఆఆఆఆఆఆ ………..(ఆఆఆఆఆఆఆ) ………..(ఆఆఆఆఆఆఆ) ఆఆఆఆఆఆఆ ………..(అఅఅఆఆఆఆ) …………… ఆఆఆఆఆఆఆ ………..(ఆఆఆఆఆఆఆ) ………..(ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ)

Swati Kiranam : Shivani Bhavani Song Lyrics (శివానీ... భవానీ... శర్వాణీ...)

చిత్రం :స్వాతికిరణం(1992)

రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : శ్రీ కే.వి .మహాదేవన్ గారు



పల్లవి : శివానీ... భవానీ... శర్వాణీ... గిరినందిని శివరంజని భవ భంజని జననీ గిరినందిని శివరంజని భవ భంజని జననీ శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ శివానీ... భవానీ... శర్వాణీ... చరణం : 1 శృంగారం తరంగించు సౌందర్యలహరివని... ఆ.... శృంగారం తరంగించు సౌందర్యలహరివని... ఆ.... శాంతం మూర్తీభవించు శివానందలహరివని... ఆ... శాంతం మూర్తీభవించు శివానందలహరివని... ఆ... కరుణ చిలుకు సిరినగవుల కనకధారవీవనీ నీ దరహాసమే దాసుల దరిజేర్చే దారియని శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ శివానీ... భవానీ... శర్వాణీ... చరణం : 2 రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ భీషణాస్త్ర కేళివనీ... అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావనీ గిరినందిని శివరంజని భవ భంజని జననీ శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ శివానీ... భవానీ... శర్వాణీ...

Swati Kiranam : Sruthi Neevu Song Lyrics (శృతి నీవు గతి నీవు )

చిత్రం : స్వాతికిరణం(1992)

రచన : వెన్నెలకంటి

గానం : వాణి జయరామ్

సంగీతం : శ్రీ కే.వి .మహాదేవన్



శృతి నీవు గతి నీవు శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శరణాగతి నీవు భారతి నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె త్యాగయ్య గలసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులె నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీభవ తారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతీ