24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

Sankranti : Andala Srimathiki Song Lyrics (అందాల శ్రీమతికి)

చిత్రం: సంక్రాంతి (2005)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: E.S.మూర్తి

గానం: హరిహరన్, శ్రేయ ఘోషల్



అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట మనసార లాలిస్తే చంటిపాప తానంట శ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలు నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు నీ నవ్వే తేనే జల్లులే మీరుంటే స్వర్గమేనులే అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట మనసార లాలిస్తే చంటిపాప తానంట చిరుగాలికి ఏదో పాపం సందేహం మనవెంటే ఉంటూ మన కబుర్లు వింటుంది ఏంటో ఈ కాలం నిలబడదే నిమషం నీవెళ్లి రానా అని పరుగులు తీస్తోంది వినలేదా మల్లెలు కోసం పలికే ఆ తుమ్మెద రాగం వింటుంటే తెలియని దాహం మొదలైంది ఇపుడే కొంచం అదే సుమా నీకు నాకు వేసెను తియ్యని బంధం ఆ కథలే మరిచిపోనులే ఊరించే జ్ఞాపకాలులే అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట మనసార లాలిస్తే చంటిపాప తానంట పొద్దెరగని ప్రణయం కోరింది హృదయం నీ లేత పెదవే ఉసికొలిపే ఈ సమయం హద్దెరగని సరసం తగదన్నది ప్రాయం శృతి మించిపోతే రుచిలేనిది శృంగారం విరజాజుల పరుగులకైనా కరునిస్తావని అనుకున్నా అలకన్నది క్షణమైనా మురిపిస్తే వశమై పోనా వేల వేల చుక్కల్లోన జాబిల్లివి నువ్వేనమ్మా జాబిలికే వెలుగు సూర్యుడే నువు లేని బ్రతుకు శూన్యమే అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట మనసార లాలిస్తే చంటిపాప తానంట శ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలు నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి