24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

Ninne Premistha : Koila Paata Bagunda Song Lyrics (కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా)

చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా అందమైన మల్లె మాల బాగుందా అల్లి బిల్లి మేఘమాల బాగుందా చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా అప్పుడిప్పుడు గున్నమామి తోటలో అట్లతద్ది ఊయలూగినట్లుగా ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా నిదురించిన ఎద నదిలో అల లెగిసిన అలజడిగా తీపితీపి చేదు ఇదా లేతపూల ఉగాది ఇదా చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గచుక్కలాగా ఉన్న తారక కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్కపెట్టినట్టు వుందిగా కలలుకనే కన్నులలో కునుకెరుగని కలవరమా రేయిలోని పలవరమా హాయిలోని పరవశమా చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది అందమైన మల్లె మాల బాగుంది అల్లి బిల్లి మేఘమాల బాగుంది చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి