చిత్రం: ఉగాది (1997)
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ఉన్నికృష్ణన్
ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా ఇవ్వాళ్ళే చూశా నిన్ను...బాగున్నావా వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా వేచి ఉంది నవ్వుల నావా.. నడపమందువా దాచుకొంది పువ్వులత్రోవ..చూపిస్తా నాతో రావా ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా వేచి ఉంది నవ్వుల నావా..వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా దాచుకొంది పువ్వులత్రోవ..వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా కనులు మూసుకోగానే ఎన్ని కలలు వస్తాయో వాటి వెంట పంపు రోజూ..చూస్తావే నీ లోపల వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా కళ్ళు తెరుచుకోగానే దారి మరిచిపోతానే కోటి చుక్కలన్నిటి మధ్య నీకోసం చూస్తుంటా కరిగేటి కలవో..నిజంగానే కలవో..అనుమానం తీర్చేయాలని...కళ్లారా కనిపించావా ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా వేచి ఉంది నవ్వుల నావా...వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా...దాచుకొంది పువ్వులత్రోవ దూసుపోని ఊహల్లో ఊయలూగు వేళల్లో పాడుకొంటూ ఉంటే నువ్వు ఆ రాగాలే విన్నావా వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా చుక్కల్లోని వీధుల్లో ఒక్కదానివే ఉంటే తోచుబాటు ఏమి లేక నీవైపే రాలేనా నువ్వు రాక మునుపే నీ రూపే తెలుసే ఎలాగంటే నాకేమి తెలుసు నా మనసుకి కబురంపేవా ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా వేచి ఉంది నవ్వులనావా... వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా దాచుకొంది పువ్వులత్రోవ... వెన్నెలగువ్వా వెన్నెలగువ్వా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి