30, అక్టోబర్ 2021, శనివారం

Vande Mataram : Aakasama Neevekkada Song Lyrics (ఆకాశమా నీవెక్కడ)

చిత్రం: వందేమాతరం (1985)

సంగీతం: చక్రవర్తి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

రచన: సి. నారాయణ రెడ్డి



పల్లవి: ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా... ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా.. నిలువగలన నీపక్కన ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా చరణం: 1 నీలాల గగనాల ఓ జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా? నీలాల గగనాల ఓ జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా? ముళ్ళున్న రాళ్లున్న నా దారిలో నీ చల్లని పాదాలు సాగేదెలా? నీ మనసన్నది నా మది విన్నది.. నిలిచి పోయింది ఒక ప్రశ్నలా నిలిచి పోయింది ఒక ప్రశ్నలా.. ఆకాశమా... లేదక్కడ ... ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీ పక్కన వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా నేలపైనే తన మక్కువ ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీ పక్కన చరణం: 2 వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై వెను తిరిగి చూడని నీ నడకలో నను కడదాక రాని నీ అడుగునై మన సహజీవనం వెలిగించాలి నీ సమత కాంతులు ప్రతి దిక్కున సమత కాంతులు ప్రతి దిక్కున ఆకాశమా నీవెక్కడ.. అది నిలిచి వుంది నా పక్కన వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా.. నేలపైనే తన మక్కువ... ఈ నేలపైనే తన మక్కువ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి