30, అక్టోబర్ 2021, శనివారం

Swarna Kamalam : Shiva Poojaku Song Lyrics (శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ)

చిత్రం: స్వర్ణ కమలం (1988)

సంగీతం: ఇళయరాజా

గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

రచన: సీతారామ శాస్త్రి



శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ మ్రుదు మంజుల పద మంజరి పూచిన పువ్వా సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ యతిరాజుకు జతి స్వరముల పరిమలమివ్వ సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ నటనాంజలితో బ్రతుకును తరించనీవా సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ పడమర పడగలపై మెరిసే తారలకై పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకె సంధ్యా సుందరి తూరుపు వేదికపై వేకువ నర్తకివై తూరుపు వెదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించె కాంతులు చిందని నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని నిదురించిన హ్రుదయరవలి ఒంకారం కాని శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ మ్రుదు మంజుల పద మంజరి పూచిన పువ్వా సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా అవధి లేని అందముంది అవనికి నలు దిక్కులా ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తొడుగా పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ లలిత చరన జనితం నీ సహజ విలాసం జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం గగన సరసి హ్రుదయములో వికసిత షతదల శోభల సువర్ణ కమలం పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా స్వధర్మె మిధనం శ్రేయహ పరధర్మో భయావహ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి