13, నవంబర్ 2021, శనివారం

Aadavari Matalaku Ardhalu Veruley : Naa Manasuki Song Lyrics (నా మనసుకి ప్రాణం పోసి)

చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)

సాహిత్యం: చంద్ర బోస్

గానం: కార్తీక్,గాయత్రి

సంగీతం: యువన్ శంకర్ రాజా



నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి  నిలిచావె ప్రేమను పంచి  నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి  నిలిచావె ప్రేమను పంచి  నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి  మది తెర తెరిచి ముగ్గె పరిచి ఉన్నావు లోకం మరిచి  నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి  నిలిచావె ప్రేమను పంచి  నీ చూపుకి సూర్యుడు చలువాయె  నీ స్పర్శకి చంద్రుడు చెమటాయె  నీ చొరవకి నీ చెలిమికి మొదలాయె మాయె మాయె  నీ అడుగుకి ఆకులు పువులాయె  నీ కులుకుకి కాకులు కవులాయె  నీ కలలకి నీ కథలకి కదలాడె హాయె హాయె  అందంగ నన్నె పొగిడి అటుపైన ఏదొ అడిగి  నా మనసనె ఒక సరసులొ అలజడులె సృష్టించావె  నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి  నిలిచావె ప్రేమను పంచి  ఒక మాట ప్రేమగ పలకాలె  ఒక అడుగు జతపడి నడవాలె  ఆ గుర్తులు నా గుండెలొ ప్రతి జన్మకు పదిలం పదిలం  ఒక సారి ఒడిలొ ఒదగాలె  ఎద పైన నిదరె పోవాలె  తియతియ్యని నీ స్మృతులతొ బ్రతికేస్త నిమిషం నిమిషం  నీ ఆసలు గమనించానే నీ ఆతృత గుర్తించాలె  ఎటు తేలక బదులీయక మౌనంగ చూస్తున్నాలె


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి