Aadavari Matalaku Ardhalu Verule లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aadavari Matalaku Ardhalu Verule లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఫిబ్రవరి 2025, ఆదివారం

Aadavari Matalaku Ardhalu Veruley : Manasa Manninchavamma Song Lyrics (మనసా మన్నించమ్మా)

చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్

సంగీతం: యువన్ శంకర్ రాజా




పల్లవి :

మనసా మన్నించమ్మా మార్గం మళ్ళించమ్మా
నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా
స్వప్నం చెదిరిందమ్మా సత్యం ఎదరుందమ్మా
పొద్దేలేని నిద్దర్లోనే నిత్యం ఉంటావా
ప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా
ప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా

చరణం : 1

దేవాలయంలా ఉంటే నీ తలపు ప్రేమ దైవంలా కొలువుంటుందమ్మా
దావానలంలా తరిమే నిట్టూర్పు ప్రేమని నీనుంచి వెలివేస్తుందమ్మా
అంత దూరం ఉంటేనే చందురుడు చల్లని వెలుగమ్మా
చెంతకొస్తే మంటేనే అందడని నీతో చెప్పమ్మా
మన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామా
తన సౌఖ్యం ముఖ్యమనే కాంక్షలో కలవరపడకమ్మా
ప్రేమా ప్రేమా నీ స్నేహమే తీరని శాపం మన్నిస్తావా


చరణం : 2

ఒక చినుకునైనా దాచదు తనకోసం నేలకు నీరిచ్చి మురిసే ఆకాశం
నదులన్నితానే తాగే ఆరాటం కడలికి తీర్చేనా దాహం ఏమాత్రం
పంజరంలో బంధించి ఆపకే నేస్తాన్నేనాడు
పల్లకివై పంపించి చల్లగా దీవించవె నేడు
ఙాపకంలో తీయదనం చేదుగా మార్చవ కన్నీళ్ళు
జీవితంలో నీ పయనం ఇక్కడే ఆపదు నూరేళ్ళు
ప్రేమా ప్రేమా మదిలో భారం కరిగించేలా ఓదార్చవా

Aadavari Matalaku Ardhalu Verule : O Baby Song Lyrics

చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)

సాహిత్యం: చంద్ర బోస్

గానం: హరిచరణ్, జెన్నీ, మాతంగి, భార్గవి పిళ్లై

సంగీతం: యువన్ శంకర్ రాజా



పల్లవి :

O baby oo baby oo baby ur so sexy...
o baby oo baby oo baby u touch me....
కళ్ళల్లొ స్వర్గం నువ్వె..
గుండెలొ నరకం నువ్వె..
పటలొ మదురం నువ్వె..
గొంతుల్లొ గరల్కం నువ్వె..
నా ప్రేమ గాధ నువ్వే ఓ చెలియ చెలియ ప్రియమైన బాధ నువ్వే నా ప్రేమ జోల నువ్వే ఓ సఖియ సఖియ మదిలోన జ్వాల నువ్వే
o baby oo baby oo baby ur so sexy ..
o baby oo baby oo baby u touch me...

చరణం : 1

పువ్వై పువ్వై పరిమళించినావే ముళ్ళై ముళ్ళై మనసు కోసినావే మెరుపై మెరుపై వెలుగు పంచినావే పిడుగై పిడుగై కలలు కూల్చినావ ప్రేమకి అర్ధం అంటే కన్నీట్లో పడవేనా ప్రేమకి గమ్యం అంటే సుడిగుండంలోకేనా చరితల్లోనే ఉండమ్మ చేయొద్దంటు ఈ ప్రేమ వినక మతిపోయి ప్రేమించానమ్మ కనుక మూల్యాన్ని చెల్లించానమ్మ

నా ప్రేమ గాధ నువ్వే ఓ చెలియ చెలియ ప్రియమైన బాధ నువ్వే నా ప్రేమ జోల నువ్వే ఓ సఖియ సఖియ మదిలోన జ్వాల నువ్వే


చరణం : 2

నువ్వే నువ్వే ఆదరించినావే
ఆ పై ఆ పై చీదరించినావే నిన్నే నిన్నే ఆశ్రయించగానే నాలో నాలో ఆశ తుంచినావే కోవెలలో కర్పూరం నా తనువును కాల్చిందే దేవత మెళ్ళొ హారం ఉరితాడై బిగిసిందే ప్రేమ పైనె నమ్మకం కొల్పొయనె ఈ క్షణం ప్రేమ పని లేని చోటికి వెల్లాలి నువ్వు కనరాని గూటికి చేరాలి

o baby oo baby oo baby ur so sexy
o baby o baby o baby o baby u touch me..

Aadavari Matalaku Ardhalu Verule : Cheli Chamaku Kanulu Song Lyrics ( చెలి చెమకు కనులు వలవేసెనులే )

చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)

సాహిత్యం: కందికొండ

గానం: అద్నాన్ సమీ, అనుష్క మంచంద, శ్వేతా మోహన్

సంగీతం: యువన్ శంకర్ రాజా


Hi ! Are you single?
I am your drink ! J
Hey Let’s go out man!
Your place or mine?


పల్లవి :

చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా
పసి నడుమే నయగారా..అడుగేసే నను చేరా
చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా

చరణం : 1

సిమ్హమల్లే పొగరు ఉందీ..నన్ను గిచ్చీ చంపుతుందీ
చక్కిలి నొక్కా..చేరర పక్కా
హే వన్నె చిన్నె ఉన్న కన్నె..లాగమాకే పైకి నన్నే
సెగతో నా మతి పోయెనా..నీ పరువం మడతడి పోవులే
అంత మగసిరి నీలోనా..ఉన్నది కద మరి రావా
చప్పునొచ్చెయ్ .. వహ్చ్చి వాటెయ్ .. చురకలే వేసేయ్
అంతగ త్వరపడలేనులే..నా మదిలో చోటిక లేదులే
ఆడుకో కధకళి ఆటలే.. పాడుకో చలిగిలి పాటలే

చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా

చరణం : 2

హే రూపు చూపీ కవ్విస్తారూ..గుండె పిండీ చంపుతారూ
మగువల జన్మా..అరె ఏవిటిర బ్రహ్మా
హో అవును అంటే కాదు అనిలే..కాదు అంటే అవును అనిలే
చల్లగ అల్లుకు పోవులే..మా చూపుల భాషలు వేరులే
ఆశ కలిగెను నీ పైనా..అల్ల్రి పెరిగెను నవ్వునా
దాచలేకా చెప్పలేకా ఏమిటో తడబాటూ
గుప్పెడు మనసున ఆశలూ..నెరవేరవు పూర్తిగ ఊహలూ
చెప్పకు పొడి పొడి మాటలే..అనుకున్నది అందితె హాయిలే

13, నవంబర్ 2021, శనివారం

Aadavari Matalaku Ardhalu Veruley : Naa Manasuki Song Lyrics (నా మనసుకి ప్రాణం పోసి)

చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)

సాహిత్యం: చంద్ర బోస్

గానం: కార్తీక్,గాయత్రి

సంగీతం: యువన్ శంకర్ రాజా



పల్లవి :

నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి 
నిలిచావె ప్రేమను పంచి 
నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి 
నిలిచావె ప్రేమను పంచి 
నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి 
మది తెర తెరిచి ముగ్గె పరిచి ఉన్నావు లోకం మరిచి 
నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి 
నిలిచావె ప్రేమను పంచి 

చరణం : 1

నీ చూపుకి సూర్యుడు చలువాయె 
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయె 
నీ చొరవకి నీ చెలిమికి మొదలాయె మాయె మాయె 
నీ అడుగుకి ఆకులు పువులాయె 
నీ కులుకుకి కాకులు కవులాయె 
నీ కలలకి నీ కథలకి కదలాడె హాయె హాయె 
అందంగ నన్నె పొగిడి అటుపైన ఏదొ అడిగి 
నా మనసనె ఒక సరసులొ అలజడులె సృష్టించావె 
నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి 
నిలిచావె ప్రేమను పంచి 

చరణం : 2

ఒక మాట ప్రేమగ పలకాలె 
ఒక అడుగు జతపడి నడవాలె 
ఆ గుర్తులు నా గుండెలొ ప్రతి జన్మకు పదిలం పదిలం 
ఒక సారి ఒడిలొ ఒదగాలె 
ఎద పైన నిదరె పోవాలె 
తియతియ్యని నీ స్మృతులతొ బ్రతికేస్త నిమిషం నిమిషం 
నీ ఆసలు గమనించానే నీ ఆతృత గుర్తించాలె 
ఎటు తేలక బదులీయక మౌనంగ చూస్తున్నాలె

Aadavari Matalaku Ardhalu Veruley : Emaindhi Eevela Song Lyrics (ఏమైంది ఈ వేళ)

చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)

సాహిత్యం: కులశేఖర్

గానం: ఉదిత్ నారాయణ్

సంగీతం: యువన్ శంకర్ రాజా


పల్లవి :

ఏమైంది ఈ వేళ
ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు
చెమటలు పోయనేల..
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా వుంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మొహం
మరువలేని ఇంద్ర జాలం
వానలోన ఇంత దాహం

చరణం : 1

చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే
తన సొగసు తీగలాగా నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే
చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే
తనువు మరిచి ఆటలాడే
ఏమైంది ఈ వేళ
ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు
చెమటలు పోయనేల..

చరణం : 2

ఆమె అందమే చూస్తే
మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసెనా
తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగా నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా
కడలిలాగే ఉరకలేసా

Aadavari Matalaku Ardhalu Veruley : Allantha Doorala Song Lyrics (అల్లంత దూరాల ఆ తారక)

చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: యువన్ శంకర్ రాజా



పల్లవి :

అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా

చరణం : 1

కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ.. సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవదా అందానికే అందమనిపించగా దిగివచ్చినొ ఏవో దివి కానుక అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా

చరణం : 2 తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందోయ్ అందరిని నిలబడనీకా ఎన్నో ఒంపులతో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుకా తొలిపరిచయమొక తియ్యని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా