చిత్రం: ఆర్య-2(2009)
రచన: బాలాజీ
గానం: కే.కే.
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఉప్పెనంత ఈ ప్రేమ కి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయి కి భాషే ఎందుకో తీయనైన ఈ బాధ కి ఉప్పునీరు కంట దేనికో రెప్ప పాటు దూరనికే విరహం ఎందుకో ఓ.. నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమ కి ఇన్ని శిక్షలు ఎందుకో ఐ లవ్ యు.. నా ఊపిరి ఆగిపొయిన ఐ లవ్ యు.. నా ప్రాణం పొయిన ఉప్పెనంత ఈ ప్రేమ కి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయి కి భాషే ఎందుకో కనులలోకోస్తావు.. కళలు నరికేస్తావు సెకనుకోసరైన చంపేస్తావు…. మంచులా ఉంటావు.. మంట పెడుతునతావు వెంటపడి నా మనసు మసి చేస్తావు… తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి గుచ్చుకోకు ముల్లులా మరి గుండెల్లో సరాసరి.. ఐ లవ్ యు.. నా ఊపిరి ఆగిపొయిన ఐ లవ్ యు.. నా ప్రాణం పొయిన ఉప్పెనంత ఈ ప్రేమ కి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయి కి భాషే ఎందుకో చినుకులే నిన్ను తాకి మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి.. కాల్చేయనా… చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే తొలకరే లేకుండా పాతేయనా.. నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే.. ఐ లవ్ యు.. నా ఊపిరి ఆగిపొయిన ఐ లవ్ యు.. నా ప్రాణం పొయిన ఉప్పెనంత ఈ ప్రేమ కి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయి కి భాషే ఎందుకో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి