14, నవంబర్ 2021, ఆదివారం

Bommarillu : Namma Tappani Song Lyrics (నమ్మక తప్పని)

చిత్రం: బొమ్మరిల్లు (2006)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: సాగర్, సుమంగళి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


పల్లవి :

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న  ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ  ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న  నీ రూపం నా చూపులనోదీలేనా ఓ ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్న నువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవే ఐన ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ

చరణం: 1

ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందా నా వెనువెంట నువ్వే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా నిలువున నను తరిమి అల వెనుదిరిగిన చెలిమి ఎలా తడి కనులతో నిను వెతికేది ఎలా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ

చరణం: 2

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళైన సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళైన ఈ నడి రాతిరి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా చేజారిన ఆశల తొలివరమా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న నీ రూపం నా చూపులనోదీలేనా ఓ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి