చిత్రం: బాహుబలి (2015)
రచన: అనంత్ శ్రీరామ్
గానం: దామిని, కార్తీక్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
పల్లవి:- (She):- పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా (He):- వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందర చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందర (She):- పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా
చరణం1:-
(He):- మాయగా నీ సోయాగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హలా (She):- కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా.? హత్తుకుపో నను ఊపిరి ఆగేలా (He):- బాహుబంధాల పొత్తిల్లలో విచ్చుకున్నావే ఓ మల్లిక కోడె కౌగిళ్ల పొత్తిళ్ళలో పురి విప్పింది నా కోరిక.
(She):- పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా
చరణం2:-
(He):- కానలో నువ్వు నేను ఒక మేను కాగా, కోనలో ప్రతి కొమ్మ మురిసేను గా (She):- మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమే సొంతము నేన్నీ సొంతము అయ్యాక (He):- చెమ్మ చేరేటి చెక్కిల్లలో చిందులేసింది సిరివెన్నెలా ప్రేమ ఊరేటి నీ కళ్ళలో రేయి కరిగింది తెలి మంచులా
(She):- పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా
జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా............
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి