Baahubali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Baahubali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, డిసెంబర్ 2021, సోమవారం

Baahubali : Mamatala Talli Song Lyrics (మమతల తల్లి)

చిత్రం: బాహుబలి (2015)

రచన: కే. శివ శక్తి దత్త

గానం: సూర్య యామిని

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


మమతల తల్లి ఒడి బాహుబలి లాలన తేలి శతధా వరాలి యెదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి.. మాహిష్మతి వరక్షత్రకులు జిత క్షాత్రవ బాహుబలి సాహస విక్రమ ధీశాలి రణతంత్ర కళా కుశలి యెదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి..

వెచిందా ఖండించే ఖడ్గం తోసిందా చేధించే బాణం చదరండి ఆ దృఢసంకల్పం తానే.. సీనాయి.. తోచే..

తల్లే తన గురువు దైవం బళ్ల తోనే సహవాసం ధ్యేయం అందరి సంక్షేమం రాజ్యం.. రాజు.. తానే.. ఓహో.. శాసన సమం శివగామి వచనం సదసద్రణారంగం ఇళ్లనం జనని హృదయం యెదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి…

మమతల తల్లి ఒడి బాహుబలి మమతల తలి ఒడ్డి బాహుబలి

9, నవంబర్ 2021, మంగళవారం

Baahubali : Dhivara prasara shourya bhara Song Lyrics (దివారా ప్రసార శౌర్య భర)

చిత్రం: బాహుబలి (2015)

రచన: రామజోగయ్య శాస్త్రి, కే. శివ శక్తి దత్త

గానం: రమ్య బెహరా, దీపు

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


హోం నన హొనన్న హోనాన హొన్న నచ్చానా హోం నన హొనన్న హోనాన హొన్న అంతాగాన అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్న అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్న ధీవర ప్రసార శౌర్య భర ఉత్సర స్థిర గంభీర

ధీవర ప్రసార శౌర్య భార ఉత్సర స్థిర గంభీర

అలసి సొలసి ఒడిలో నిన్ను లాలించిన

అడుగునై నడపన్నని జంట పయనించిన

పడి పడి తలపడి వడి వడి త్వరపడి వస్తున్న ఏదేమైనా

సిగముని విడిచిన శిఖరపు జలసిరి ధారాల్ని జట జూటంలా ఢీకొని

సవాలని తెగించి నీవైపు దూసుకొస్తున్న ఉగ్రమ అసమ శౌర్య భావ రౌద్రమ నవ భీతిర్మ

ఉగ్రమ అసమ శౌర్య భావ రౌద్రమ నవ భీతిర్మ

నిలువునా ఎదగర నిన్ను రమ్మంది నా తొందర

కథలకే కధానామై గగనానికి ధారీదేమిరా విజితరపురుధిరధార కలితర శిఖర కర కులకుతరథిలిత గంభీర జయవిరాట్ వీర

విలయగగనతల భీకర గర్జాధార గార

హృదయ రస కాసారా విజిత మధు పారా పార

భయగారాంశావ్ విభవసింధు సుపరాధంగం భరణారంది

భయగారాంశావ్ విభవసింధు

సుపరాధంగం భరణారంది

భయగారాంశావ్ విభవసింధు

సుపరాధంగం భరణారంది

భయగారాంశావ్ విభవసింధు

సుపరాధంగం భరణారంది

ధీవర ప్రసార శౌర్య భర ఉత్సర స్థిర గంభీర

ధీవర ప్రసార శౌర్య భార ఉత్సర స్థిర గంభీర

ధీవర దరికి చేరారా సుందర చెలి నీదేరా

Baahubali : Manohari Song Lyrics (ఇరుక్కుపో... హత్తుకోని వీరా వీరా..)

చిత్రం: బాహుబలి (2015)

రచన: చైతన్య ప్రసాద్

గానం: మోహన భోగరాజు, రేవంత్

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


ఇరుక్కుపో... హత్తుకోని వీరా వీరా... కొరుక్కుపో... నీ తనివితీరా తీరా... తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తియరా తియరా... ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయరా చెయరా... మనో... హరి... మనో... హరి... తేనెలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా... మాటలన్నీ మత్తుగున్నవే... ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి... వెంటపడితే వింతగున్నదే... ఒళ్లంతా తుళ్ళింత... ఈ వింత కవ్వింతలేలా బాల... ఇరుక్కుపో హత్తుకోని వీరా వీరా... కొరుక్కుపో నీ తనివితీరా తీరా... చేప కన్నుల్లోని కైపులు నీకు ఇచ్చెయ్ నా... నాటు కొడవల్లాంటి నడుమె దాసి ఇచ్చెయ్ నా... నీ కండల కొండలపై నా కైదండలు వేసెయ్యినా... నా పయ్యెద సంపదలే... ఇక నీ శయ్యగ చేసెయ్యినా... సుఖించగా రా... మనో... హరి... మనో... హరి... పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె జల్లుతుంటే... కొట్టుకుంది గుండె తుమ్మెదై... ఒళ్లంతా తుళ్ళింత... ఈ వింత కవ్వింతలేలా బాల ఇరుక్కుపో హత్తుకోని వీరా వీరా... కొరుక్కుపో నీ తనివితీరా తీరా...

Baahubali : Pacha Bottasi Song Lyrics (పచ్చ బొట్టేసిన పిల్లగాడా)

చిత్రం: బాహుబలి (2015)

రచన: అనంత్ శ్రీరామ్

గానం: దామిని, కార్తీక్

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



పల్లవి:- (She):- పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా (He):- వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందర చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందర (She):- పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా

చరణం1:-

(He):- మాయగా నీ సోయాగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హలా (She):- కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా.? హత్తుకుపో నను ఊపిరి ఆగేలా (He):- బాహుబంధాల పొత్తిల్లలో విచ్చుకున్నావే ఓ మల్లిక కోడె కౌగిళ్ల పొత్తిళ్ళలో పురి విప్పింది నా కోరిక.

(She):- పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా

చరణం2:-

(He):- కానలో నువ్వు నేను ఒక మేను కాగా, కోనలో ప్రతి కొమ్మ మురిసేను గా (She):- మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమే సొంతము నేన్నీ సొంతము అయ్యాక (He):- చెమ్మ చేరేటి చెక్కిల్లలో చిందులేసింది సిరివెన్నెలా ప్రేమ ఊరేటి నీ కళ్ళలో రేయి కరిగింది తెలి మంచులా

(She):- పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా............

Baahubali : Nippulaa Swasa Ga Song Lyrics ( నిప్పులే శ్వాసగా )

చిత్రం: బాహుబలి (2015)

రచన: ఇనగంటి సుందర్, కే. శివ శక్తి దత్త

గానం: ఎం.ఎం.కీరవాణి

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా

తరతరాల ఎదురుచూపులో ఆవిరైన నీ కన్నీళ్లు ఆనవాళ్లు ఈ సంకెళ్లు రాజ్యమా ఉలికిపడు..............

కసిగ కసిగ గెలుపు దిశగ కదిలె కదన రథం చెదిరి పడక కుదరదిపుడు అసుర తిమిర శకం నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో అడుగు అడుగు పిడుగులవగ కదిలె మేరు నగం ఎవరికెదురు నిలవగలరు ఒకడె ప్రళయ దళం రాజ్యమా ఉలిక్కి పడు.

5, నవంబర్ 2021, శుక్రవారం

Baahubali 2 : Dandaalayyaa Song Lyrics (పడమర కొండల్లో వాలిన సూరీడా)

చిత్రం: బాహుబలి-2 (2017)

రచన: ఎం.ఎం.కీరవాణి

గానం: కాల భైరవ

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



పడమర కొండల్లో వాలిన సూరీడా... పగిలిన కోటలనే వదిలిన మారేడా... పడమర కొండల్లో వాలిన సూరీడా... పగిలిన కోటలనే వదిలిన మారేడా... తడిసిన కన్నుల్లో మళ్లీ ఉదయించి... కలలో దేవుడిలా కాపై ఉంటావా... నీ అడుగులకే మడుగులు ఒతే వాళ్ళం.. నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా...

దండాలయ్యా దండాలయ్యా... మాతోనే నువ్వుడాలయ్యా... దండాలయ్యా దండాలయ్యా...మాతోనే నువ్వుడాలయ్యా... తమ నేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటూ... ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా... తను చిందించే చేమటను తడిసి పుణ్యం దొరికిందనుకుంటూ... పులకించిన ఈనెలంతా పచ్చగ అయిపోదా... మీమాటే మా మాటయ్యా... నీ చూపే శాసనమయ్యా... మా రాజు నువ్వే తండ్రి నువ్వే కొడుకు నువ్వే... మా ఆయువు కూడా నీదయ్యా... దండాలయ్యా దండాలయ్యా... మా రాజై నువ్వుడాలయ్యా... దండాలయ్యా దండాలయ్యా మా రాజై నువ్వుడాలయ్యా...

Baahubali 2 : Saahore Baahubali Song Lyrics (సాహొరె బాహుబలి)

చిత్రం: బాహుబలి-2 (2017)

రచన: కే. శివశక్తి దత్తా, డా. కే. రామకృష్ణ

గానం: దలేర్ మెహందీ, ఎం.ఎం. కీరవాణి, మౌనిమ

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


భలి భలి భలి రా భలి సాహొరె బాహుబలి భలి భలి భలి రా భలి సాహొరె బాహుబలి జై హారతి నీకె పట్టాలి పట్టాలి భువనాలన్ని జై కొట్టాలి గగణాలే చత్రం పట్టాలి హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స ఆఆ.... జనని దీక్షా అచలం ఈ కొడుకే కవచం ఇప్పుడా అమ్మకే అమ్మవైనందుకా పులకరించిందిగా ఈ క్షణం.... అడువులు గుట్టాల్ మిట్టాల్ గమించు పిడికిట పిడుగుల్ పట్టి మించు అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు అవనికి స్వర్గాలె దించు అంత మహా బలుడైనా అమ్మ వొడీ పసివాడె శివుడైన భవుడైన అమ్మకు సాటి కాదంటాడే హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స భలి భలి భలి రా భలి సాహొరె బాహుబలి జై హారతి నీకె పట్టాలి భలి భలి భలి రా భలి సాహొరె బాహుబలి జై హారతి నీకె పట్టాలి పట్టాలి భువనాలన్ని జై కొట్టాలి గగణాలే చత్రం పట్టాలి

హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స