చిత్రం: భద్ర (2005)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కార్తీక్ , కె.యస్.చిత్ర
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఏమైంది సారూ..ఏంటా హుషారు బాగుంది జోరు..ఊరంత హోరు..హొయ్ హొయ్ హే..ఏమైంది సారూ..ఏంటా హుషారు బాగుంది జోరు..ఊరంత హోరు ఆనందమొస్తే ఇంతే..కాదా అందరూ ఆరాలుతీసే వింతే..లేదే నమ్మరూ చాల్లే జతులు..చెడిపోవా మతులు ఇల్లంటి కుప్పిగంతులు..వెస్తారా చెప్పు నీలాంటి బుద్ధిమంతులు..!! ఎన్నో పనులు..వెంటపడి తరిమేటపుడు తీరిగ్గా చెమ్మచెక్కలు..ఆడేదెలాగో చెప్పండి అమ్మలక్కలు..!! ఆహా..చూసాంలే ఎంత భారం నువు మోసే రాచకార్యం చేస్తాంలే మేముసైతం చేతనైన సాయం !! హే..వేసే అడుగు..ఎటువైపో అడుగు ఏ నింగి చుక్కవరకు..దూరిందిలాగ నీ కొంటె గాలి పరుగు..!! తీసే పరుగు..బిడియపడి ఆగే బెరుకు పెళ్ళీడు ఆడపిల్లకే ఉండాలికానీ మాలాంటి వాళ్ళకెందుకు ?? అరెరెరె అబ్బాయీ నీ బడాయి ఆకాశం దాటెనోయి మాతోనా నీ లడాయి చాలు ఆపవోయి !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి