చిత్రం: భలే భలే మగాడివోయ్ (2015)
రచన: రామ జోగయ్య శాస్త్రి
గానం: సచిన్ వ్వారియెర్
సంగీతం: గోపి సుందర్
స స ప మ ప స స.. స స ప మ ప స స.. ప ప ని ని ప మ గ మ ప మ.. మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ.. ఎదురయ్యింది చందమామా.. హేల... చారడేసి కళ్ళా... గుండెల్లో గుచ్చుకున్న ముల్లా... ఓహో... హో హేల... పువ్వంటి పెదాలా.. నా స్వాశనాపే బంగారు బాణాలా... స స ప మ ప స స.. స స ప మ ప స స.. ప ప ని ని ప మ గ మ ప మ.. మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ.. ఎదురయ్యింది చందమామా.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. మధు మంత్రం చవి చూస్తున్నా.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. మర యంత్రం ఐపోతున్నా.. అడుగే నన్ను వద్దన్నా పరుగే ఇక ఆగేనా.. ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా... నాలో ప్రేమనూ నీ కానుకివ్వగా.. అర చేతులందు మొలిచెను పూవనం.. నీ వల్లనే చెలీ..నా గుండే లోతుల్లో.. ఓ పాలపుంత పేలిన సంబరం... స స ప మ ప స స.. స స ప మ ప స స.. ప ప ని ని ప మ గ మ ప మ.. మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ.. ఎదురయ్యింది చందమామా.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. కనురెప్పల దోచెలి చాచా.. ఓ.. ఓ.. ఓ.. ఓ... కలలోకి నిన్నే పిలిచా.. తొలి చూపున ప్రేమించా.. మలి చూపున మనసిచ్చా.. నిదురకి ఇక సెలవిచ్చా.. నీ సాక్షిగా పరిచయమే ఓ పరవశమై.. నను పదమందే నీ నీడగా.. నా జత సగమై రేపటి వరమై.. నువ్వూంటావా నా తోడుగా.. హేల... చారడేసి కళ్ళా... గుండెల్లో గుచ్చుకున్న ముల్లా... ఓహో... హో హేల... పువ్వంటి పెదాలా.. నా స్వాశనాపే బంగారు బాణాలా... స స ప మ ప స స.. స స ప మ ప స స.. ప ప ని ని ప మ గ మ ప మ.. మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ.. ఎదురయ్యింది చందమామా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి