చిత్రం: అ..ఆ(2016)
రచన: రామ జోగయ్య శాస్త్రి
గానం: రమ్య బెహరా, రాహుల్ నంబియార్, సాయి శివాని
సంగీతం: మిక్కీ జే మేయర్
నలుపు తెలుపు నా కాటుక కళ్ళకు రంగు రంగు కలలిచ్చినదెవరు దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ నిదుర మరచిన రెప్పల జంటకు సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరూ నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ యిష్టం రంగ్ దేరే రంగ్ దేరే ... రంగ్ దే రంగ్ దే ... రంగ్ దేరే రంగ్ దేరే రంగ్ దేరే ... రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దేరే రంగ్ దేరే ... రంగ్ దేర్ రంగ్ దే రంగ్ దే ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముద్దు రంగెయ్యొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ మత్తు రంగెయ్యొద్దు నా మేని ఒంపులకీ కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ యిష్టం నీలి మేఘం నెమలి పింఛం రెంటికీ లేదు ఏమంత దూరం ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటినేనాడు విడదీయలేం రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముద్దు రంగెయ్యొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ మత్తు రంగెయ్యొద్దు నా మేని ఒంపులకీ కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ రామ బాణం సీత ప్రాణం జన్మలెన్నైన నీతో ప్రయాణం రాధ ప్రాయం మురళి గేయం జంట నువ్వుంటె బృందావనం రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే రంగ్ దేరే రంగ్ దే ... రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముద్దు రంగెయ్యొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ మత్తు రంగెయ్యొద్దు నా మేని ఒంపులకీ కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి