7, నవంబర్ 2021, ఆదివారం

Bharat Ane Nenu : Vachaadayyo Saami Song Lyrics ( వచ్చాడయ్యో సామి )

చిత్రం: భరత్ అనే నేను (2018)

రచన: రామ జోగయ్య శాస్త్రి

గానం: కైలాష్ ఖేర్,దివ్య కుమార్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 


ముసలి తాతా… ముడత ముఖం మురిసిపోయెనే… (మురిసిపోయెనే) గుడిసె పాకా… గుడ్డి దీపం మెరిసిపోయెనే… (మెరిసిపోయెనే) రచ్చబండ పక్కనున్న… రాములోరి గుళ్ళో గంటా రంగ రంగ… సంబరంగ మోగెనే వచ్చాడయ్యో సామి… నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి… కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో సామి… నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఓఓ… ఇచ్చాడయ్యో సామి… కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పార తియ్యండి… మన కష్టం సుక్కలు… కుంకుమ బొట్టుగ పెట్టండి (మన కష్టం సుక్కలు… కుంకుమ బొట్టుగ పెట్టండి) ఓఓ ఓహో… అన్నం పెట్టే పని ముట్లే… మన దేవుళ్ళు మరి ఆయుధాల… పూజలు చేద్దాం పట్టండి (మరి ఆయుధాల… పూజలు చేద్దాం పట్టండి) అమ్మోరు కన్ను తెరిచిన నవరాతిరి… ఇన్నాళ్ళ సిమ్మ సీకటి… తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో సామి… నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ ఓఓ… ఇచ్చాడయ్యో సామి… కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఓఓ… మట్టి గోడలు చెబుతాయి… సీమ మనుషుల కష్టాలు యే దారి గతుకులు చెబుతాయి… పల్లె బ్రతుకుల చిత్రాలు పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు… మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా అస్సలైన పండగ ఎపుడంటే… ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓనాడు కళకళ వెలిగిన… రాయలోరి సీమిది ఈనాడు వెల వెల బోతే… ప్రాణమంత చినబోతుంది వచ్చాడయ్యో సామి… నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఓ… ఇచ్చాడయ్యో సామి… కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ హే… చేతి వృత్తులు నూరారు… చేవకలిగిన పనివారు హే హే… చెమట బొట్టు తడిలోనే… తళుక్కుమంటది ప్రతి ఊరు ఎండపొద్దుకి వెలిగిపోతారు… ఈ అందగాళ్ళు వాన జల్లుకు మెరిసిపోతారూ ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు… వీళ్ళందరిలాగే బాగ బతికే హక్కులు ఉన్నోళ్ళూ పల్లెటూళ్ళు పట్టుకొమ్మలని… వట్టి జోల పాట పాడకా తల్లడిల్లు తలరాతలకు… సాయమేదొ చేయాలంట వచ్చాడయ్యో సామి… నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఓఓ… ఇచ్చాడయ్యో సామి… కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి