5, నవంబర్ 2021, శుక్రవారం

Indra : Ghallu Ghallu Song Lyrics (ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే )

చిత్రం: ఇంద్ర (2002)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్

సంగీతం: మణి శర్మ


ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బువాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరని జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల  రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపని అన్నెం పున్నెం ఎరుగని మాసీమకు రా రమ్మని ఆహ్వానం అందించనీ మెరిసే చూపుని తొలగింది ముప్పు అని నీలిమబ్బు మనసారా నవ్వని చిరుజల్లుముంపు మన ముంగిలంతా ముత్యాలె చల్లని ఆ సాసు గంధయై నేలంతా సంక్రాంతి గీతమై పాడేల శాంతిమంత్రమై గాలంతా దిశలన్నీ అల్లనీ ఈవేళ  జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల  రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల భువిపై ఇంద్రుడు పిలిచెర కరుణా వరదై పలకర ఆకసాన్ని ఇలదించర మురిసే వానగ మారని యాతన తీర్చగ మా తలరాతలు మార్చగ ఈ జలయజ్ఞము సాక్షిగ తలనే వంచర మహరాజు తానె ప్రమిదల్లె మారి నిలువెల్లా వెలిగెర బోగాన్ని విడిచి త్యాగాన్ని మలచి తాపసిగా నిలిచెరా జన క్షేమమె తన సంకల్పముగ తన ఊపిరె హొమ జ్వాలలుగ స్వర్గాన్నె శాసించెనుర అమృతమును ఆహ్వానించెనురజడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల  రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బువాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరని జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల  రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి