25, నవంబర్ 2021, గురువారం

Jalsa : Chalore Chalore Song Lyrics (ఛలోరే ఛలోరే)

చిత్రం: జల్సా(2008)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రంజిత్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్ నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్ చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్ సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్ ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్ అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్ రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్ తారలనే తెంచగలం తలుచుకుంటే మనం రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి