24, నవంబర్ 2021, బుధవారం

Kalusukovalani : Udayinchina Suryudini Song Lyrics (ఉదయించిన సూర్యుడినడిగా)

చిత్రం: కలుసుకోవాలని (2002)

రచన: దేవి శ్రీ ప్రసాద్

గానం: దేవి శ్రీ ప్రసాద్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



హే' ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని చిక్కవే హే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపిగురుతులే మనసు అంత నీ రూపం, నా ప్రాణమంత నీకోసం నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం నీ జాడ తెలిసిన నిమిషం, అహ అంతులేని సంతోషం ఈ లోకమంత నా సొంతం, ఇది నీ ప్రేమ ఇంద్రజాలం అడుగు అడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే కలల నుండి ఓ నిజమై రావే, నన్ను చేరవే హోయ్' ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే ఎదను మీటు సుస్వరమైనావే, నన్ను చేరవే హే' ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని నువ్వు లేక చిరుగాలి, నా వైపు రాను అంటోంది నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది కాస్త దూరమే కాదా, మన మధ్యనొచ్చి వాలింది దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది ఏమి మాయవో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని హోయ్' నువ్వు ఎక్కడున్నావో గాని నన్ను కాస్త నీ చెంతకు రానీ నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపనీ హే' ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని చిక్కవే హే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి 

ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపిగురుతులే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి