చిత్రం: జనతా గ్యారేజ్(2017)
రచన: రామ జోగయ్య శాస్త్రి
గానం: సుఖ్విందర్ సింగ్, విజయ్ ప్రకాష్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే పరివారం అంటారు
ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచ్చే ధ్యేయంగా పుట్టారు
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
ఆపదలో నిట్టూర్పు అది చాల్లే వీరికి పిలుపు
దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా
ఎక్కడికక్కడ తీర్పు వీరందించే ఓదార్పు
తోడైవుంటారు తోబుట్టిన బంధంలా
మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా మేమున్నామంటారు
కన్నీళ్లల్లో నవ్వులు పూయిస్తూ
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట
తప్పూ ఒప్పేదో సంహారం తరువాత
రణమున భగవద్గీత చదివింది మన గతచరిత
రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంటా
ఎవరో వస్తారు మనకేదో చేస్తారు
అని వేచే వేదనకూ జవాబే ఈ జనతా
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు జయహో జనతా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి