Janatha Garage లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Janatha Garage లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, నవంబర్ 2021, శనివారం

Janatha Garage : Jayaho Janatha Song Lyrics (జయహో జనతా)

చిత్రం: జనతా గ్యారేజ్(2017)

రచన: రామ జోగయ్య శాస్త్రి

గానం: సుఖ్విందర్ సింగ్, విజయ్ ప్రకాష్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకి ఏమవరూ అయినా అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురూ దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయహో జనతా వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు పరులకు వెలుగిచ్చే ధ్యేయంగా పుట్టారు ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకి ఏమవరూ అయినా అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురూ దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయహో జనతా ఆపదలో నిట్టూర్పు అది చాల్లే వీరికి పిలుపు దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా ఎక్కడికక్కడ తీర్పు వీరందించే ఓదార్పు తోడైవుంటారు తోబుట్టిన బంధంలా మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా మేమున్నామంటారు కన్నీళ్లల్లో నవ్వులు పూయిస్తూ ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకి ఏమవరూ అయినా అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురూ దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయహో జనతా ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట తప్పూ ఒప్పేదో సంహారం తరువాత రణమున భగవద్గీత చదివింది మన గతచరిత రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంటా ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని వేచే వేదనకూ జవాబే ఈ జనతా ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకి ఏమవరూ అయినా అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురూ దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు 

జయహో జనతా 


7, నవంబర్ 2021, ఆదివారం

Janatha Garage : Rock On Bro Song Lyrics (రాక్‌ ఆన్ బ్రో )

చిత్రం: జనతా గ్యారేజ్(2017)

రచన: రామ జోగయ్య శాస్త్రి

గానం: రఘు దీక్షిత్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


రాక్‌ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫు కింగు సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్లు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషీ మన్నాటలో చంటోడిలా ఆహా అనాలి నేడు మనలో మనిషి మనసిపుడు మబ్బులో విమానం నేలైనా నింగితో సమానం మత్తుల్లో ఇదో కొత్త కోణం కొత్త ఎత్తుల్లో ఎగురుతుంది ప్రాణం ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా ఉత్తేజమో ఉల్లాసమో ఇవాల్టి నవ్వు రంగు వేరే కదా మనమంతా జీన్సు ప్యాంటు రుషులు బ్యాక్‌ ప్యాక్‌లో బరువు లేదు అసలు వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికేద్దాం ఓ నిండు రేయి పగలు ఇదీ మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం

Janatha Garage : Pranaamam Song Lyrics (ప్రణామం ప్రణామం )

చిత్రం: జనతా గ్యారేజ్(2016)

రచన: రామ జోగయ్య శాస్త్రి

గానం: శంకర్ మహదేవన్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం ప్రమోదం ప్రమోదం ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం ప్రయాణం ప్రయాణం విశ్వంతో మమేకం ప్రయాణం మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులు తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమీసంద్రం ఆశే పచ్చదనం మారే ఋతువుల్లా వర్ణం మన మనసుల భావోదేవేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో యెల్లది సృష్టి చరిత అనుభవమే దాచింది కొండంత తన అడుగుళ్ళూ అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతం ఇదంతా ఇది యెవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరములనాటి కదంతా మన తదుపరి మిగలాలంతా కదపక చెరపక పదికలలిది కాపాడాలంట ప్రేమించే పెధమ్మే ఈ విశ్వం ఇష్టాంగా గుండెకు హత్తుకుందాం కన్నెర్రే కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం

ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం




6, నవంబర్ 2021, శనివారం

Janatha Garage : Apple Beauty Song Lyrics (దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ)

చిత్రం: జనతా గ్యారేజ్(2017)

రచన: రామ జోగయ్య శాస్త్రి

గానం: యజిం నిజార్, నేహా భాసిన్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ నిను చూసి కనిపెట్టాడా న్యూటన్‌ గ్రావిటీ దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ నిను చూసి కనిపెట్టాడా న్యూటన్‌ గ్రావిటీ నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్‌ బల్బయిందా ఏమిటీ ఓహో... నీ అందం మొత్తం ఓహో... ఒక బుక్కుగా రాస్తే ఆకాశం ఓహో... నీ సొగసుని మొత్తం ఓహో.... ఓ బంతిగ చేస్తే భూగోళం దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ నిను చూసి కనిపెట్టాడా న్యూటన్‌ గ్రావిటీ నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్‌ బల్బయిందా ఏమిటీ చరణం:1 సెల్ఫీ తీస్తున్న నిన్ను చూస్తూ కెమేరా కన్ను క్లిక్‌ కే కొట్టడమే మర్చిపోతుందే స్పైసి చూపులతో అట్టా చెంపలు కొరికేస్తే నువ్వు ఐ ఫోన్ యాపిల్‌ సింబల్‌ గుర్తుస్తోందే కాఫీడేలో విన్న సూఫీ మ్యూజిక్‌ లా ఘుమ్మా ఘుమ్మందే నీ అందం ఒక్కోటీ దేశం బోర్డర్లోని ఆసమ్ సోల్జర్లా కాటుక కళ్ల కలలకు నువ్వే సెక్యూరిటీ దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ నిను చూసి కనిపెట్టాడా న్యూటన్‌ గ్రావిటీ నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్‌ బల్బయిందా ఏమిటీ చరణం: 2 సన్నా నడుమోంపుల్లోన సగమై ఆ చందమామ బల్లేగా లెప్టూ రైటూ సెటిలైందే మేన్లీ కనుపాపల్లోన మండే ఓ ప్యూజియమా లావా వరదల్లే చుట్టుముడుతోందే పిల్లా నువ్వేగానీ నేపాల్లో పుట్టుంటే ఎవరెస్టు మౌంటైనైనా హీటేక్కిస్తావే ఆడీకార్ సున్నాల్లాగా నువ్వూ నేను పెనవేస్తే చూసే కళ్లు పట్టపగలే ఫ్లడ్ లైట్సౌతాయే దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ నిను చూసి కనిపెట్టాడా న్యూటన్‌ గ్రావిటీ నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్‌ బల్బయిందా ఏమిటీ