చిత్రం: ఖైదీ(1983)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి: మెర మెర మెరుపుల మేనకనీ ప్రణయ సంకలపు సారికనీ మనసిత మలయిజ వీచికనీ మాం పా సిస్తే నీసేవికనే నా గాధ వినరా గాధేయా నా గాధ వినరా గాధేయా
నీ తపము మాని నా తపన తీర్చరా వ్యతము లేలరా రస జగము లేలరా సురలు నరులు చూడలేని సుఖము నీదిరా ఎగిరింది ఎగిరింది తన ఉదక మండలం సడలింది సడలింది ముని తపో నిశ్చయం నిష్టుర నీరస నిశ్చల తాపసి హృదయం గెలిచింది ఆ క్షణమే మేనక ప్రణయం వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే
వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే
శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే
అందాలో జన్మ గంధాలో రాగ బంధాలో
శకుంతమై వసంత గీత మాలపించగా
చరణం 1:
ఋషి కత మారే రసికత మీరే
చెలి నీ కౌగిళ్ళకే స్వర్గాలెన్నో చేరే
సరసకు చేరే సరసుని కోరే
వలపు వాకిళ్లల్లో సాక్షాలెన్నో చూచే
యజ్ఞము యాగము సోమము నియమము నీరాయే నీ చూపుకే మోహినీ
అందము చందము నవ్విన యవ్వన రాగాలు నీకోసమే
వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే
చరణం 2:
మల్లెల బాణం తగిలెను ప్రాణం
రగిలే దాహాలలో మోహాలెన్నో రేగే
మదవతి రూపం మదనా లాపం
పిలిచే రాగాలలో లోకాలన్నీ ఊగే
ఇంద్రుడు చంద్రుడు జీవుడు దేవుడు నీ రూపమైపోయే ఓ కౌశికా
మంత్రము శాస్త్రము యోగము భోగము నే ధారపోశానులే
వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే అందాలో జన్మ గంధాలో రాగ బంధాలో శకుంతమై వసంత గీత మాలపించగా
వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి