చిత్రం: ఇంద్ర (2002)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కల్పన
సంగీతం: మణి శర్మ
అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి
అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి హాజరవ్వ వచ్చి తినిపించక మిర్చి వాయినాలు తెచ్చి వడ్డించు వార్చి ముప్పూట ముద్దొచ్చి మనువాడె మాటిచ్చి మేళాలు తెప్పించి ఊరంతా తిప్పిచి కోన దాటిందమ్మ కోటప్ప కొండయమ్మ కోరుకున్నానమ్మ కో అంటే పలికాడమ్మ కోలు కొలోయమ్మ కొలుకోలు కోలోయమ్మ డోలు డోలో యమ్మ ఢం డోలు డోలుయమ్మ
అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి వాయినాలు తెచ్చి వడ్డించు వార్చి
చరణం: 1
పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్న కోలో, కోలో యన్న కోలన్న కోలో మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా డోలు డోలో యన్న డోలన్నడోలో

ఏరోజుకారోజు నామోజులెన్నో మరుగుతున్నాయిలే ఈ రోజు నారాజులో సెగలు ఎన్నో రగులుతున్నాయిలె
అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి వాయినాలు తెచ్చి వడ్డించు వార్చి
చరణం: 2
బక్కచిక్కి నడుమేదో బావురుమంటుంటె కోలోకోలోయన్న కొలన్న కొలో అందమంతా అచ్చొచ్చి చిచ్చేపెడుతుంటె డోలు డోలోయన్న డొలన్న డోలో

ఏపూట కాపూట నీపాట నాకై పలకరించాలిలే ఈ పూట నీపైట ఆచోటమాటే వినను అన్నావిలె
అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి హాజరవ్వ వచ్చి తినిపించక మిర్చి వాయినాలు తెచ్చి వడ్డించు వార్చి ముప్పూట ముద్దొచ్చి మనువాడె మాటిచ్చి మేళాలు తెప్పించి ఊరంతా తిప్పిచి కోన దాటిందమ్మ కోటప్ప కొండయమ్మ కోరుకున్నానమ్మ కో అంటే పలికాడమ్మ కోలు కొలోయమ్మ కొలుకోలు కోలోయమ్మ డోలు డోలో యమ్మ ఢం డోలు డోలుయమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి