చిత్రం: మిస్టర్ పర్ ఫెక్ట్(2006)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: మల్లికార్జున్, కార్తీక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎప్పటికీ తన గుప్పెట విప్పదు ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణముండదు చిక్కులలో పడడం తనకేం సరదా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా నిన్న మొనా్న నీ లోపలా కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా ఈరోజేమైందని ఏదైనా అయ్యిందని నీకైనా కాస్తయినా అనిపించిందా ఎప్పటికీ తన గుప్పెట విప్పదు ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణముండదు చిక్కులలో పడడం తనకేం సరదా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా ఏదోలా చూస్తారే నిన్ను వింతలా నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతలా మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూవుంటే నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా సంబరపడి నిను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా నీ తీరే మారింది నిన్నకీ నేటికీ నీ దారే మళ్లుతోందా కొత్త తీరానికి మార్పేదైనా వస్తుంటే నువ్వది గుర్తించక ముందే ఎవరెవరో చెబుతూవుంటే నమ్మేదెలా వెళ్లే మార్గం ముళ్లుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసే వీళ్లేదెలా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి