చిత్రం: నేను (2004)
రచన: వేటూరి
గానం: హరీష్ రాఘవేంద్ర
సంగీతం: విద్యాసాగర్
దేవతలా నిను చూస్తున్నా దీపంలా జీవిస్తున్నా నా ప్రాణం నువ్వు తీస్తున్నా నీ ధ్యానం నే చేస్తున్నా ఎవరమ్మా.. నువ్వెవరమ్మా.. ఇంతకీ నాకు నువ్వెవరమ్మా ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలక మిగిలింది వేళ్లపై అది వాలిన మరక ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలక మిగిలింది వేళ్లపై అది వాలిన మరక ఆరారో.. ఆరారో.. ఆరారో.. ఆరారో.. దేవతలా నిను చూస్తున్నా దీపంలా జీవిస్తున్నా సుడిగాలికి చిరిగినా ఆకు అలగదు చెలి చూపుకి నలిగినా మనసు మరవదు నీ ఒడిలో చేరలేని నా ఆశలు ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలు ఎండమావిలో సాగే పూల పడవలు గుండె దాచుకోలేని తీపి గొడవలు అందీ అందని దానా అందమైన దానా అంకితం నీకే అన్నా నను కాదన్నా ఆరారో.. ఆరారో.. ఆరారో.. ఆరారో.. దేవతలా నిను చూస్తున్నా దీపంలా జీవిస్తున్నా నా ప్రాణం నువ్వు తీస్తున్నా నీ ధ్యానం నే చేస్తున్నా నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు నీ వెన్నెల నీడలైన నా ఊహలు నీ కన్నులు మాటాడిన నీలి ఊసులు ఈ సమాధిపై పూచే సన్న జాజులు నిదర రాని నిట్టూర్పుల జోల పాటలు చక్కనైన చినదానా దక్కని దానా రెక్కలు కట్టుకు రానా తెగిపోతున్నా ఆరారో.. ఆరారో.. ఆరారో.. ఆరారో..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి