5, నవంబర్ 2021, శుక్రవారం

Nuvvostanante Nenoddantana : Niluvaddam Ninne Song Lyrics (నిలువద్దము నిను ఎప్పుడైనా)

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీపేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపెరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నామాట విన్నట్టు నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీప్రేమనే ప్రశ్నించుకో ఆనింద నాకెందుకు

నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం

నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి