Nuvvostanante Nenoddantana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nuvvostanante Nenoddantana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, నవంబర్ 2021, శుక్రవారం

Nuvvostanante Nenoddantana : Chandrulo Unde Song Lyrics (చంద్రుళ్ళో ఉండే కుందేలు )

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శంకర్ మహదేవన్, దేవి శ్రీ ప్రసాద్, కల్పన

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా నువ్వలా సాగే దోవంతా నావలా తూగే నీవెంట నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జావళీల జాణతనం బాటచూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంత వరకో రేపు వైపు ముందడుగా లేని పోని దుందురుకా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే లెక్కలే మాయం అయిపోవా రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా

Nuvvostanante Nenoddantana : Paripoke Pitta Song Lyrics (పారిపోకే పిట్టా)

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: మల్లికార్జున్, సాగర్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


తుర్ ....... హేయ్ పారిపోకే పిట్టా..... తుర్ ..... చేరనంటే ఎట్టా .....తుర్... హేయ్ పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా అంత మారం ఎంటంట మాట వినకుండా సరదాగా అడిగాగ మజిలీ ..చేర్చవా...... తీసుకూపో ని వెంట ,తుర్ .... వస్తా తీసుకూపో ని వెంట తుర్.. తుర్..... హే.. హే.. హే... హే నా సంతోషాన్నంతా పంపించా తన వెంట భద్రంగానే ఉందా ఎ బెంగ పడకుండా తన అందెలుగా తోడిగా నా చిందర వందర సరదా ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా హొయ్..... చినబోయిందేమో చెలి కోమ్మ ఆ గుండెల గూటికి ముందే కబురియ్యవే చిలకమ్మ🕊 నీ వాడు వస్తాడే ప్రేమ అని త్వరగా వేళ్ళి నువ్విన్నా... కథలన్ని చెప్పమ్మా కాకమ్మా... తీసుకూపో నీ వెంట , వస్తా తీసుకూపో నీ వెంట తుర్ .... హే.. హే.. హే... హే హేయ్ పుటుక్కు జర జర డుబుక్కు మే పుటుక్కు జర జర డుబుక్కు మే ఆకలి కనిపించింది నిన్నేంతో నిందించింది అన్నం పెట్టను పోవే అని కసిరేసావంది నిద్దుర ఎదురయ్యింది తెగ చిరిగ్గ ఉన్నట్టుంది తన వద్దకు రావద్దంటు తరిమేశావంటుంది హొయ్ ..... ఎం గారం చేస్తావే ప్రేమా... నువ్వడిగిందివ్వని వాళ్ళంటూ ఎవరున్నారమ్మా ఆ సంగతి నీకు తేలుసమ్మా...... నీ పంతం ముందు ఎ నాడు ఏ ఘనుడు నిలిచాడో.... చెప్పమ్మా తీసుకూపో నీ వెంట , ఓ ప్రేమా తీసుకూపో నీ వెంట హ.. హ.. హ.. హ... తీసుకూపో నీ వెంట అరె తీసుకూపో నీ వెంట, తీసుకూపో నీ వెంట హోయ్ ... హోయ్ ...హోయ్ ...హోయ్ .......

Nuvvostanante Nenoddantana : Niluvaddam Ninne Song Lyrics (నిలువద్దము నిను ఎప్పుడైనా)

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీపేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపెరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నామాట విన్నట్టు నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీప్రేమనే ప్రశ్నించుకో ఆనింద నాకెందుకు

నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం

నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

Nuvvostanante Nenoddantana : Aakasam Thakela Song Lyrics (ఆకాశం తాకేలా)

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , దేవి శ్రీ ప్రసాద్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


ఘల్ ఘల్ ఘల్ ఘల్… ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్… ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్ ఆకాశం తాకేలా… వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే..!! ఆరాటం తీరేలా… బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే..!! అణువణువును మీటే… మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం… ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు… చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే… చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన… రంగులు అన్ని రప్పించి మాగాణి ముంగిట పెట్టే… ముగ్గే ప్రేమంటే ఘల్ ఘల్ ఘల్ ఘల్… ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్… ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్

ప్రాణం ఎపుడు మొదలైందో… తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా..!! ప్రణయం ఎవరి హృదయంలో… ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా..!! ప్రేమంటే ఏమంటే… చెప్పేసెయ్ మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే… అది చరితలు సైతం… చదవని వైనం కవితను సైతం… పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే..!! దరిదాటి ఉరకలు వేసే… ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన… తొలి చినుకేదంటే సిరి పైరై ఎగిరేవరకు… చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు… తొలిపిలుపేదంటే

ఘల్ ఘల్ ఘల్ ఘల్… ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్… ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్

మండే కొలిమినడగందే… తెలియదే మన్ను కాదు ఇది స్వర్నమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే… పదునుగా నాటే నాగలిపోటే చేసిన మేలంటే… తనువంతా విరబూసే… గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే… విలువే ఉంటే అలాంటి మనసుకు… తనంత తానై అడగక దొరికే వరమే వలపంటే… జన్మంతా నీ అడుగుల్లో… అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా… నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో… ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్ వెతికే… సంక్రాంతై ఎదురవదా

ఘల్ ఘల్ ఘల్ ఘల్… ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్… ఘలక్ ఘలన్ ఘల ఘల్ ఘల్