చిత్రం: ఓం నమో వెంకటేశాయ (2018)
రచన: వేదవ్యాస
గానం: రమ్య బెహరా
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
వేంకటేశా, శ్రీనివాసా, శేషశైలవాస… మాధవా, కేశవా, మధుసూదనా… మాధవా, కేశవా, మధుసూదనా నంద నందనా… నరహరి నారాయణా… పరమాత్మా, పరంధామ పరమానందా… అచ్యుతా అనంతా గోవిందా… అచ్యుతా అనంతా గోవిందా… వేయి నామాలవాడ వేంకటేశుడా… మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా… వేయి నామాలవాడ వేంకటేశుడా… మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా… కోటి కోటి దండాలయ్య కోనేటిరాయడా… కోటి కోటి దండాలయ్య కోనేటిరాయడా… కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా మురహరా, నగధరా, మురళీధర శ్రీకరా, శ్రీధరా, శ్రిత మందార… సర్వేశ్వర పరమేశ్వర శాంతాకారా… శంక చక్రధరా సప్త శైలేశ్వరా… సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా… సూర్యుడవయ్యా… అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా… మాధవా కేశవా అభిషేక సేవలో మురిసేవయ్యా… మురిసేవయ్యా… ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా… శ్రీకరా శ్రీధరా… కోటి కోటి దండాలయ్య కోనేటిరాయడా… కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా… పద్మనాభ, హ్రిషికేశ, పద్మనాభ హ్రిషికేశ… పన్నగ శయన. పరశురామ, బలరామ, రఘుకుల రామ… పురుషోత్తమ, పుణ్య పురుష, పుండరీకాక్ష… వామన, వాసుదేవ వాంఛిత వరద… వేయి నామాల వాడ వేంకటేశుడా మూడు నామాల… ముద్దు శ్రీనివాసుడా… నిజ పాద దర్శనమున… నిలిచేవయ్యా… నిలిచేవయ్యా… నీ పాదాలె దిక్కు అని చాటెదవయ్యా… అచ్యుతా అవ్యయా… నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా… ఇచ్చేవయ్యా… మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా… మురహర, నగధరా… కోటి కోటి దండాలయ్యా… ఆ ఆ ఆ కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడా… కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా… వేయి నామాల వాడ వేంకటేశుడా మూడు నామాల… ముద్దు శ్రీనివాసుడా… కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడా… కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి