10, నవంబర్ 2021, బుధవారం

Om Namo Venkatesaya : Akhilanda Koti Song Lyrics (అఖిలాండకోటి )

చిత్రం: ఓం నమో వెంకటేశాయ (2018)

రచన: వేదవ్యాస

గానం: శరత్ సంతోష్, శ్రీనిధి

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా ఆనంద నిలయం వరపరిపాలకా గోవిందా గోవిందా పువ్వు పున్నమి వెన్నెల్ల గోవిందా గోవిందా గోవిందా చిన్ని పూమాల సేవల గోవిందా వినా వేంకటేశం ననాథో ననాధ సదా వేంకటేశం స్మరామి స్మరామి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా ఆనంద నిలయం వరపరిపాలకా శ్రీ వేంకటేశా శ్రిత సంబంధా ! సేవా భాగ్యం దేహి ముకుందా !! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా ఆనంద నిలయం వరపరిపాలకా *తిరు పదములకు తిరువడి దండలు శ్రీ భూ సతులకు సిరి హారములు తిరు పదములకు తిరువడి దండలు శ్రీ భూ సతులకు సిరి హారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమ మాలికలు ఆజానుబాహు పర్యంతం అలరులు తావళ హారములు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా ఆనంద నిలయం వరపరిపాలకా (2) *మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువం దమనం మావి మాచి వట్టివేరు కురువేరులు గరుడ గన్నేరు నందివర్ధనాలు !! హరిత హరిద్ర బిల్వ తులసీదళాలు నీకోసం విరిసే నినుచూసి మురిసే నీ మేను తాకి మెరిసే !! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా ఆనంద నిలయం వరపరిపాలకా !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి