చిత్రం: ఊసరవెల్లి (2011)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ఎం. ఎల్. ఆర్.కార్తికేయన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం ! శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం !! ఓ బజరంగబలి దుడుకున్నదిగా నీ అడుగులలో నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో ఓ పవమానసుత పెను సాహసముందిగా పిడికిలిలో లే పని చెప్పర దానికి విషమ పరీక్షలలో స్ఫురణ తెచ్చుకుని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగరా నివురు నొదిలి శివ ఫాల నేత్రమై దనుజ దహనుమునకై దూసుకురా x2 శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం దండిచాలిర దండకారివై దుండగాల దౌష్ట్యం శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం పూరించాలి రా నీ శ్వాసతో ఓంకార శంఖం ఆ బ్రహ్మాస్త్రము సైతము వమ్మవదా నీ సన్నిధిలో? ఆ యమపాశమే పూదండవదా నీ మెడలో? నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నదీ హృదయములో అదే రహదారిగ మార్చద కడలిని పయనములో శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం సదా రక్షకా కాపాడని నీ నామధేయం ! ఓం.. భజే వాయుపుత్రం భజే వాలగాత్రం సదా అభయమై అందించర నీ చేతి సాయం!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి