చిత్రం: పెళ్లిసందడి(2021)
రచన: చంద్రబోస్
గానం: హరి చరణ్, శ్వేత పండిట్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు సర్వం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటాది మెల్లగా గిల్లుతుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది మరి నువ్వంటే నాకు ప్రాణం నేనంటే నీకు లోకం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటాది మెల్లగా గిల్లుతుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది తనువు తనువున తీయదనమే నింపుతుంటది పలుకు పలుకునా చిలిపితనమే చిలుకుతుంటది కొత్తంగా కొంగోత్తంగా ప్రతి పనినే చేయమంటది ప్రాణానికే ప్రాణం ఇచ్చే పిచ్చితనమే మారుతుంటది ఇంక ఏమేం చేస్తుంది పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది నువ్వంటే నాకు నేనంటే నీకు నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి