Pelli SandaD లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pelli SandaD లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, నవంబర్ 2021, గురువారం

Pelli SandaD : Pelli Sandadi song Lyrics డుడుం డుడుం)

చిత్రం: పెళ్లిసందడి(2021)

రచన: చంద్రబోస్

గానం: హేమ చంద్ర, దీపు, రమ్య బెహరా

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



పట్టు చీరలా తళతళలూ… పట్టగొలుసులా గలగలలూ పట్టు చీరలా తళతళలు… పట్టగొలుసులా గలగలలు పూల చొక్కల రెపరెపలు… సిల్కు పంచెల టపటపలు కాసుల పేరులా ధగధగలు… కాఫీ గాజుల భుగభుగలు మామిడాకుల మిలమిలలు… కొబ్బరాకుల కళకళలు గట్టిమేళాల ఢమఢమలు డమ్మా డమ్మా ఢమఢమలు గట్టిమేళాల ఢమఢమలు… వంటశాలలో ఘుమఘుమలు అన్నీ అన్నీ అన్నీ అన్నీ అన్నీ కలిపితే పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి (పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి) మహిళామనుల చింత పిక్కలు, హబ్బో పుణ్య పురుషులా పేక ముక్కలు బావమరుదులు పరిహాసాలు పాత మిత్రుల పలకరింపులు అందరితోటి ఫోటోలు… అంత్యాక్షరి పోటీలు అందరితోటి ఫోటోలు… అంత్యాక్షరి పోటీలు అత్తమామల ఆత్మీయతలు… తాతభామ్మలా ఆశీస్సులు అందరు చల్లే అక్షింతలు, అమ్మా నాన్నల అమ్మానాన్నల తడి కన్నులు, హ్మ్ సెంటిమెంటు బాగా ఎక్కువైందబ్బయా కొంచం సెటప్పు బీటు మార్చండిరా బాబు కన్నెపిల్లల కొంటె నవ్వులు కుర్ర కన్నుల దొంగ చూపులు అందగత్తెల చిలిపి సైగలు కోడిగిత్తల చురుకు చేష్టలు చెవులను ఊగెను జూకాలు మోగించెను మదిలో బాకాలు ముక్కుపుడకలో మిరుమిట్లు పెదవెరుపులు పెంచెను పదిరెట్లు ఆఆ ఆ ఆ, పచ్చని ఓణీ అందాలు నచ్చినాయి ఆ పరువాలు మొక్కుకుంటే అదే పదివేలు ఆహాలు యమ ఓహోలు ఎవడికి తెలియని సంగతులు ఎరగా విసిరే బిస్కటులు ఎంత పొగిడినా మీ కధలు ఆశలు దోషలు అప్పడాలు, చెల్ రే చెల్ పెళ్ళిసందడీ పెళ్ళిసందడీ పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి డడం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి డడం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి

24, నవంబర్ 2021, బుధవారం

Pelli SandaD : Bujjulu Bujjulu Song Lyrics (పాలకుండ నెత్తినెట్టి )

చిత్రం: పెళ్లిసందడి(2021)

రచన: చంద్రబోస్

గానం: బాబా సెహగల్ , మంగ్లీ

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


పాలకుండ నెత్తినెట్టి పంజాగుట్ట పోతావుంటే బోరబండ పోరగాడు రాయి పెట్టి కొట్టినాడు రాయి పెట్టి కొట్టినాడు రాయి పెట్టి కొట్టినాడు కుండపాలు గుట్టగుట్ట గుటకలేసి తాగినాడు చిల్లుపడ్డ కుండతోటి ఇంటికెట్టా పొనురా పోరాడ నీ మీద కోపమొచ్చేరా కోపమొచ్చేరా కోపమొచ్చేరా నీ బుంగమూతి సూడనీకి రాయి తోటి కొట్టినా కంటి ఎరుపు సూడనీకి కుండ పగలకొట్టినా అలక నీది సూడనీకు అల్లరేన్తో చేసినా బుజ్జులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు కొనిపెడతా బంగరు గజ్జెలు హే బుజ్జులు బుజ్జులు బుజ్జులు తినిపిస్త తీయని ముంజులు గోస తీరిపోయేలాగా గుమ్మరిస్తా ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు హే గోస తీరిపోయేలాగా గుమ్మరిస్తా ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు కట్టుకుంటా బంగరు గజ్జెలు బుజ్జులు బుజ్జులు బుజ్జులు కొరికి తింటా తీయని ముంజులు గోస తీరిపోయేలాగా తీసుకుంటా నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు నా గోస తీరిపోయేలాగా తీసుకుంటా నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు చమ్కీలు కోననీకి చార్మినార్ పోతావుంటే అప్సల్ గంజ్ కాడ అడ్డమొచ్చినవ్ బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్ మీద జల్లినవ్ మీద జల్లినవ్ బుగ్గ మీద జల్లినవ్ బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్ రంగు చూసి మా అయ్యా రంకెలేస్తడు మచ్చ చూసి మా అమ్మ రచ్చ చేస్తది పోరాడ నీతోటి పీకులాటరా హ హ హ… మీ అమ్మంటే భయమంటవ్ నేనంటే ప్రేమంటావ్ అయ్యంటే వనుకంటావ్ నన్ను చూస్తే కులుకంటావ్ మీ అమ్మంటే భయమంటవ్ నేనంటే ప్రేమంటావ్ అయ్యంటే వనుకంటావ్ నన్ను చూస్తే కులుకంటావ్ అందరికంటే నేను ఇష్టమంటావ్ ఇష్టమంటావ్ ఆ ముచ్చటంత లో లోనే దాచుకుంటావ్ బుజ్జులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు కొరికేస్తా రవ్వల గాజులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు పెట్టేస్తా కాలికి మెట్టెలు అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్న కట్టివేస్తా మేడలో పుస్తెలు అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్న కట్టివేస్తా మేడలో పుస్తెలు కట్టివేస్తా మేడలో పుస్తెలు బుజ్జులు బుజ్జులు బుజ్జులు అందుకుంటా రవ్వల గాజులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు పెట్టుకుంటా కాలికి మెట్టెలు అడ్డం ఎవ్వడొచ్చిమన ఆపుతున్న కట్టమంటా మేడలో పుస్తెలు అడ్డం ఎవ్వడొచ్చిమన ఆపుతున్న కట్టమంటా మేడలో పుస్తెలు అయిపోదాం ఆలు మగలు భల్లే భల్లే భల్లే బుజ్జులు భల్లే భల్లే భల్లే బుజ్జులు భల్లే హ భల్లే హ భల్లే బుజ్జులు భల్లే హ భల్లే హ భల్లే బుజ్జులు

5, నవంబర్ 2021, శుక్రవారం

Pelli SandaD: Premante Enti Song Lyrics (నువ్వంటే నాకు ధైర్యం)

చిత్రం: పెళ్లిసందడి(2021)

రచన: చంద్రబోస్

గానం: హరి చరణ్, శ్వేత పండిట్

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు సర్వం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటాది మెల్లగా గిల్లుతుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది మరి నువ్వంటే నాకు ప్రాణం నేనంటే నీకు లోకం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటాది మెల్లగా గిల్లుతుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది తనువు తనువున తీయదనమే నింపుతుంటది పలుకు పలుకునా చిలిపితనమే చిలుకుతుంటది కొత్తంగా కొంగోత్తంగా ప్రతి పనినే చేయమంటది ప్రాణానికే ప్రాణం ఇచ్చే పిచ్చితనమే మారుతుంటది ఇంక ఏమేం చేస్తుంది పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది నువ్వంటే నాకు నేనంటే నీకు నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి


4, నవంబర్ 2021, గురువారం

PelliSandaD : Madhura Nagarilo Song Lyrics (మధురా నగరిలో)

చిత్రం: పెళ్లిసందడి(2021)

రచన: చంద్రబోస్

గానం: శ్రీనిధి, నాయన నాయర్, కాల భైరవ

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



మధురా నగరిలో యమునా తటిలో మురళి స్వరములే ముసిరిన ఎదలో కురిసేనంట మురిపాల వానా లయాలై హోయలై జల జల జతులై హా…. గల గల గతులై ఆ… వలపుల శ్రుతులై వయసుల ఆతృతలై దొరక్క దొరక్క దొరికింది తలుక్కు చిలక ఇధి పలక్క పలక్క పలికేస్తు జలక్కు విసిరినది రెండూ కల్లల్లో కల్లు పెట్టి కౌగిల్ల ఇల్లు కట్టి నచ్చావు నువ్వు అన్నది గుండె గుమ్మంలో కాలుపెట్టి గుట్టంతా బయట పెట్టి గుర్తించుకో మన్నది మధురా నగరిలో మధురానగరిలో యమునా తటిలో మురళి స్వరములే ముసిరిన ఎదలో చెంతకొచ్చేయగానే చమక్కు చమక్కు చురుకు చురుకు చటుక్కు చటుక్కు చిటుక్కులే చెయ్యి పట్టేయగానే తడక్కు తడక్కు దినక్కు దినక్కు ఉడుకు ఉడుక్కు దుడుక్కులే నువ్వు లేక చందమామ చిన్నబోయే నిన్ను చేరి వెన్నెలంత వెల్లువయే నువ్వు రాక మల్లెపూలు తెల్లబోయే నిన్ను తాకి పూలగుట్ట తెలికాయే ఈ మాటకే ఈరోజుకే ఇన్నాళ్లు వెచానే రక్క దొరక్క దొరికింది తలుక్కు చిలక ఇధి పలక్క పలక్క పలికేస్తు జలక్కు విసిరినది రెండూ కల్లల్లో కల్లు పెట్టి కౌగిల్ల ఇల్లు కట్టి నచ్చావు నువ్వు అన్నది గుండె గుమ్మంలో కాలుపెట్టి గుట్టంతా బయట పెట్టి గుర్తించుకో మన్నది మధురా నగరిలో మధురానగరిలో యమునా తటిలో మురళి స్వరములే ముసిరిన ఎదలో