చిత్రం: రాధే శ్యామ్(2021)
రచన: కృష్ణ కాంత్
గానం: జస్టిన్ ప్రభాకరన్
సంగీతం: యువన్ శంకర్ రాజా , హరిణి ఇవటూరి
ఎవరో వీరెవరో… కలవని ఇరు ప్రేమికులా ఎవరో వీరెవరో… విడిపోని యాత్రికులా వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల ఆటాడే విదే ఇదా ఇదా పదే పదే కలవడం ఎలా ఎలా కల రాసే ఉందా… రాసే ఉందా, ఆ ఆఆ ఈ రాతలే దోబూచులే ఈ రాతలే… దోబూచులే ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటోందే ఏ గూఢచారో… గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే గాయం లేదు గాని… దాడెంతో నచ్చే ఆ మాయే ఎవరే… రాడా ఎదురే తెలీకనే తహతహ పెరిగే నిజమా భ్రమ… బాగుంది యాతనే కలతో కలో గడవని గురుతులే ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే ఈ రాతలే… దోబూచులే ఈ రాతలే… దోబూచులే ఈ రాతలే… దోబూచులే ఏ గూఢచారో… గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో ఆ మాయే ఎవరే… రాడా ఎదురే తెలీకనే తహతహ పెరిగే ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి