చిత్రం: రక్తసింధూరం (1985)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి:
ల ల ల ల ల ల ల ల ల ల ల ల
ల ల ల ల ల ల ల ల ల ల ల ల
(m) అది సరిగమ పాడిన స్వర వీణ
(m) ఇది సరసాలాడిన చలి వీణ
(f) ఇది చూపులు కలిసిన సుఖ వీణ
ఇది ముసి ముసి నవ్వుల ముఖ వీణ
(m) జుమ్మని పలికిన ఎద వీణ
నను రమ్మని పిలిచిన రస వీణ
(f) అది సరిగమ పాడిన స్వర వీణ
(m) ఇది సరసాలాడిన చలి వీణ
చరణం1:
(m) ముట్టుకుంటే ముద్దు వీణ ఓఓఓ .......
అంటుకుంటే హాయి వీణ ఓఓఓ .......
పడుచు గుండెకు పల్లవి తానై
పడతి నడకకు చరణమ్ తానై
జాణలో వీణలే జావళీ పాడని
(f) చందమామ మీద వాలి సన్నజాజి తేనె తాగి
(f) హత్తుకుపోయే వేళా నా మత్తులు పెరిగే వేళల్లో
వీణలో తీగనే దోచుకో తీయగా
(m) అది సరిగమ పాడిన స్వర వీణ
(m) ఇది సరసాలాడిన చలి వీణ
(f) ఇది చూపులు కలిసిన సుఖ వీణ
ఇది ముసి ముసి నవ్వుల ముఖ వీణ
(m) జుమ్మని పలికిన ఎద వీణ
నను రమ్మని పిలిచిన రస వీణ
(f) అది సరిగమ పాడిన స్వర వీణ
(m) ఇది సరసాలాడిన చలి వీణ
చరణం 2:
(f) చీర చాటు సిగ్గు వీణ ఓఓఓ.....
చేతికొస్తే చెంగు వీణ ఓఓఓ ..........
కిలుపు నవ్వుల కీర్తన తానై
వలపు మల్లెల వంతెన తానై
సోలినా అందమే గాలిలో తేలని
(m) నీలి నింగి పక్క మీద తారకొక్క ముద్దు పెట్టి
(m) అల్లరి చేసే వేళా నిన్నల్లుకుపోయే వేళల్లో
రాగమై భావమై బంధమై పాడనా
అది సరిగమ పాడిన స్వర వీణ
ఇది సరసాలాడిన చలి వీణ
(f) ఇది చూపులు కలిసిన సుఖ వీణ
ఇది ముసి ముసి నవ్వుల ముఖ వీణ
(m) జుమ్మని పలికిన ఎద వీణ
నను రమ్మని పిలిచిన రస వీణ
(f) అది సరిగమ పాడిన స్వర వీణ
(m) ఇది సరసాలాడిన చలి వీణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి