Raktha Sindhuram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Raktha Sindhuram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జనవరి 2025, బుధవారం

Raktha Sindhuram : O Chinnadana Song Lyrics (ఓ చిన్నదానా )

చిత్రం: రక్తసింధూరం (1985)

రచన:  వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



పల్లవి :

ఓ చిన్నదానా నా ఒంటిబాధ కన్నావా..  ఓ భామా
ఈ సందెవేళ నా జాలి గాధ విన్నావా.. రా భామా 
నా కంటిపాపా నీ జంటతోనే ఓ ఇంటివాణ్ణి చేసేయ్యవా
ఏకాంత వేళ   ఈ కాంత సేవా వరమియ్యవా
ఓ చిన్నవాడా  చిలకమ్మ తోడ విన్నాలే నీ గోలా
నా ఇంటి దొంగ నీ ఇంటి బెంగ కన్నాలే ఈ వేళ
ఈ చంటివాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తాను గానీ మానెయ్యవా
నా అందమంతా నీ హారతేలే లాలించరా

చరణం 1 :

జలకాలాడించనా.. జడలే అల్లించనా
జాజీపూలెట్టి పూజించనా
కసిగా కవ్వించనా... రుచిగా నవ్వించనా
నడుమే అందించి లాలించనా
ఇల్లే కట్టేస్తే.. కౌగిళ్లిచ్చేస్తా
ముగ్గే పెట్టెస్తే ముగిళ్లిచేస్తా
సామిరంగ సందెముద్దు పెట్టనీదాయే
నింగిలోని రంగు పొద్దు జారనీడాయే

ఓ చిన్నదానా నా ఒంటిబాధ కన్నావా..  ఓ భామా
నా ఇంటి దొంగ నీ ఇంటి బెంగ కన్నాలే ఈ వేళ


చరణం 2  :

మనసై జపించనా... వయసై తపించనా
మల్లేదీపాలు వెలిగించనా
సొగసై వరించనా.. సగమై తరించనా
మసకా మంత్రాలు వల్లించనా
ముసిరే సిగ్గుల్తో ముద్దే ఇచ్చేస్తా
ఇచ్చే ముద్దుల్తో నచ్చేదిమ్మంటా
అబ్బరంగా ఒక్కటిచ్చి పండుకోడాయే
నిబ్బరంగా నిప్పు ఈడు ఉండనీదాయే

ఓ చిన్నవాడా  చిలకమ్మ తోడ విన్నాలే నీ గోలా
ఈ సందెవేళ నా జాలి గాధ విన్నావా.. రా భామా 
ఈ చంటివాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తాను గానీ మానెయ్యవా
ఏకాంత వేళ   ఈ కాంత సేవా వరమియ్యవా  
ఉమ్మ్.. ఉమ్మ్మ్.. ఉమ్మ్మ్.. ఉహు..హు..ఉహు..
అహాహా... ఓ..హో..హో...




10, నవంబర్ 2021, బుధవారం

Raktha Sindhuram : Adi Sarigama Song Lyrics (అది సరిగమ)

చిత్రం: రక్తసింధూరం (1985)

రచన:  వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి




పల్లవి:

ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల (m) అది సరిగమ పాడిన స్వర వీణ (m) ఇది సరసాలాడిన చలి వీణ (f) ఇది చూపులు కలిసిన సుఖ వీణ ఇది ముసి ముసి నవ్వుల ముఖ వీణ (m) జుమ్మని పలికిన ఎద వీణ నను రమ్మని పిలిచిన రస వీణ (f) అది సరిగమ పాడిన స్వర వీణ (m) ఇది సరసాలాడిన చలి వీణ

చరణం1:

(m) ముట్టుకుంటే ముద్దు వీణ ఓఓఓ ....... అంటుకుంటే హాయి వీణ ఓఓఓ ....... పడుచు గుండెకు పల్లవి తానై పడతి నడకకు చరణమ్ తానై జాణలో వీణలే జావళీ పాడని (f) చందమామ మీద వాలి సన్నజాజి తేనె తాగి (f) హత్తుకుపోయే వేళా నా మత్తులు పెరిగే వేళల్లో వీణలో తీగనే దోచుకో తీయగా (m) అది సరిగమ పాడిన స్వర వీణ (m) ఇది సరసాలాడిన చలి వీణ (f) ఇది చూపులు కలిసిన సుఖ వీణ ఇది ముసి ముసి నవ్వుల ముఖ వీణ (m) జుమ్మని పలికిన ఎద వీణ నను రమ్మని పిలిచిన రస వీణ

(f) అది సరిగమ పాడిన స్వర వీణ (m) ఇది సరసాలాడిన చలి వీణ

చరణం 2: చేతికొస్తే చెంగు వీణ ఓఓఓ ..........
కిలుపు నవ్వుల కీర్తన తానై
వలపు మల్లెల వంతెన తానై
సోలినా అందమే గాలిలో తేలని
(m) నీలి నింగి పక్క మీద తారకొక్క ముద్దు పెట్టి (m) అల్లరి చేసే వేళా నిన్నల్లుకుపోయే వేళల్లో
రాగమై భావమై బంధమై పాడనా
అది సరిగమ పాడిన స్వర వీణ
ఇది సరసాలాడిన చలి వీణ (f) ఇది చూపులు కలిసిన సుఖ వీణ
ఇది ముసి ముసి నవ్వుల ముఖ వీణ
(m) జుమ్మని పలికిన ఎద వీణ
నను రమ్మని పిలిచిన రస వీణ (f) అది సరిగమ పాడిన స్వర వీణ

(m) ఇది సరసాలాడిన చలి వీణ
(f) చీర చాటు సిగ్గు వీణ ఓఓఓ.....