13, నవంబర్ 2021, శనివారం

Satyam : I Am In Love Song Lyrics (కనులలో.. దాచినా.)

చిత్రం: సత్యం (2003)

రచన: కందికొండ

గానం: వేణు

సంగీతం: చక్రి


I am in Love.. I am in Love..I am in Love with you కనులలో.. దాచినా.. కావ్యమే నువ్వూ కావేరి కదిలితే..మేఘాలు ఉరిమితే..మనసులో నువ్వే ఆ నింగి కరిగితే..ఈ నేల చేరిన..చినుకువే నువ్వే గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ జీవితం నిను చేరటం కొరకే ! I am in Love.. I am in Love..I am in Love with you కనులలో.. దాచినా.. కావ్యమే నువ్వూ కోటి కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్న ప్రాణమా వెన్నెల్లో గోదారీ..నువ్వే నా వయ్యారీ..నే నీటి చుక్కైపోవాలీ నవ్వేటి సింగారీ..వెళ్ళొద్దు చేజారీ..నిను చేరి మురిసిపోవాలీ చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై నిను నేను చేరుకుంటే హాయీ నిను నేను చేరుకుంటే హాయీ ! నీవు ఎదురుగ నిలిచి ఉండగ మాట దాటదు పెదవినీ నన్ను మృదువుగ నువ్వు తాకగ మధువు సోకెను మనసునీ నీ చెంత చేరాలీ స్వర్గాన్నే చూడాలీ..నేనీలో నిండిపోవాలీ ! నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో..నిలువెల్లా నేనే తడవాలీ ! నాలోని ప్రేమా ఏనాటికైనా నీకే అంకితమవ్వనీ నీకే అంకితమవ్వనీ ! I am in Love.. I am in Love..I am in Love with you కనులలో.. దాచినా.. కావ్యమే నువ్వూ కావేరి కదిలితే..మేఘాలు ఉరిమితే..మనసులో నువ్వే ఆ నింగి కరిగితే..ఈ నేల చేరిన..చినుకువే నువ్వే గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ జీవితం నిను చేరటం కొరకే !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి