Satyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Satyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2021, శనివారం

Satyam : I Am In Love Song Lyrics (కనులలో.. దాచినా.)

చిత్రం: సత్యం (2003)

రచన: కందికొండ

గానం: వేణు

సంగీతం: చక్రి


I am in Love.. I am in Love..I am in Love with you కనులలో.. దాచినా.. కావ్యమే నువ్వూ కావేరి కదిలితే..మేఘాలు ఉరిమితే..మనసులో నువ్వే ఆ నింగి కరిగితే..ఈ నేల చేరిన..చినుకువే నువ్వే గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ జీవితం నిను చేరటం కొరకే ! I am in Love.. I am in Love..I am in Love with you కనులలో.. దాచినా.. కావ్యమే నువ్వూ కోటి కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్న ప్రాణమా వెన్నెల్లో గోదారీ..నువ్వే నా వయ్యారీ..నే నీటి చుక్కైపోవాలీ నవ్వేటి సింగారీ..వెళ్ళొద్దు చేజారీ..నిను చేరి మురిసిపోవాలీ చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై నిను నేను చేరుకుంటే హాయీ నిను నేను చేరుకుంటే హాయీ ! నీవు ఎదురుగ నిలిచి ఉండగ మాట దాటదు పెదవినీ నన్ను మృదువుగ నువ్వు తాకగ మధువు సోకెను మనసునీ నీ చెంత చేరాలీ స్వర్గాన్నే చూడాలీ..నేనీలో నిండిపోవాలీ ! నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో..నిలువెల్లా నేనే తడవాలీ ! నాలోని ప్రేమా ఏనాటికైనా నీకే అంకితమవ్వనీ నీకే అంకితమవ్వనీ ! I am in Love.. I am in Love..I am in Love with you కనులలో.. దాచినా.. కావ్యమే నువ్వూ కావేరి కదిలితే..మేఘాలు ఉరిమితే..మనసులో నువ్వే ఆ నింగి కరిగితే..ఈ నేల చేరిన..చినుకువే నువ్వే గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ జీవితం నిను చేరటం కొరకే !

Satyam : Pilichina Palakadu Song Lyrics (పిలిచిన పలకదు ప్రేమ)

చిత్రం: సత్యం (2003)

రచన: కందికొండ

గానం: రవి వర్మ, చక్రి

సంగీతం: చక్రి


పిలిచిన పలకదు ప్రేమ వలచిన దొరకదు ప్రేమ అందని వరమే ప్రేమ మనసుకు తొలికలవరమా ప్రేమే మధురం ప్రేమే పదిలం ఏమీకాదో క్షణికం అన్నీ తానే ప్రణయం ఐ లవ్ యూ లవ్ యూ రా  ఐ లవ్ యూ లవ్ యూ రా పిలిచిన పలకదు ప్రేమ వలచిన దొరకదు ప్రేమ వలపును చినుకుగ భావించా అది నా తప్పుకదా వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా ఎన్నేళ్లో ఎదురీత ఎన్నాళ్లీ ఎదకోత ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు లాభం నష్టం చూడకు ప్రేమవదు తప్పుంటే అది ప్రేమది కాదే తప్పంతా ప్రేమించిన నాదే ప్రేమ ప్రేమ ప్రేమ...  ప్రేమ ప్రేమ ప్రేమ... పిలిచిన పలకదు ప్రేమ వలచిన దొరకదు ప్రేమ మనసును తరిమిన చీకటులే చెలిమిగ మారేనా ఇదివరకెరుగని ఈ బాధే కొలిమైపోయేనా ఆపాలి ఏదోలా చె బుతావా ప్రియురాలా నీడై నీతో పాటు సాగాలనుకున్నానే నేడే తెలిసెను నాకు ఓ చెలియా నింగీ నేల కలవవనీ నీడే మనిషిని తాకదనీ ప్రేమ ప్రేమ ప్రేమ...  ప్రేమ ప్రేమ ప్రేమ...  ఆపిన ఆగదు ప్రేమ దాచిన దాగదు ప్రేమ మనసును కలుపును ప్రేమ మహిమలు చూపును ప్రేమ ప్రేమే గగనం ప్రేమే సహనం ప్రేమే కాదా ఉదయం ప్రేమించాలి హృదయం ఐ లవ్ యూ లవ్ యూ రా  ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా

2, జులై 2021, శుక్రవారం

Satyam : Madhurame Madhurame Song Lyrics (మధురమె మధురమే )

చిత్రం: సత్యం

సంగీతం: చక్రి

సాహిత్యం: కందికొండ

గానం: శంకర్ మహదేవన్


మధురమె మధురమే మధురమే

ఈ కనులకి కలలు మధురమే

సెలయేటికి అలలూ మధురమే

నీలాల మేఘం నువ్వై

నీ నవ్వే తేనెల వానై

నాకోసం వస్తె మధురమే ఆ

నన్నె తడిపేస్తె మధురమే


మధురమె మధురమే మధురమే

ఈ కనులకి కలలు మధురమే

సెలయేటికి అలలూ మధురమే

నీలాల మేఘం నువ్వై

నీ నవ్వే తేనెల వానై

నాకోసం వస్తె మధురమే ఆ

నన్నె తడిపేస్తె మధురమే


నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే

నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమే

నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే

నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమే

లిపిలేని సడి లేని ఆ కన్నుల భాష మధురమే

హృదయాన్ని మురిపించె ఆ సాగర ఘోష మధురమే

మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే

ఉంటె నువ్వుంటె ఆ శూన్యం అయినా మధురమే మధురమే


మధురమె మధురమే మధురమే

ఈ కనులకి కలలు మధురమే

సెలయేటికి అలలూ మధురమే

నీలాల మేఘం నువ్వై

నీ నవ్వే తేనెల వానై

నాకోసం వస్తె మధురమే ఆ

నన్నె తడిపేస్తె మధురమే


సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే

చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే

సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే

చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే

ఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే

రేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే

చెక్కిలి నెరుపు మధురమే

చెలి కాటుక నలుపు మధురమే

రాల్చె కన్ను రాల్చె ఆ కన్నీరైన మధురమే మధురమే


మధురమె మధురమే మధురమే

ఈ కనులకి కలలు మధురమే

సెలయేటికి అలలూ మధురమే

నీలాల మేఘం నువ్వై

నీ నవ్వే తేనెల వానై

నాకోసం వస్తె మధురమే ఆ

నన్నె తడిపేస్తె మధురమే

Satyam : O Maguva Song Lyrics (ఓ మగువా నీతో స్నేహం కోసం)

చిత్రం: సత్యం

సంగీతం: చక్రి

సాహిత్యం: భాస్కర భట్ల

గానం: చక్రి


ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...

కాళిదాసులాగ మారి కవితే రాసేశా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...

దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా

ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా

ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా

పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా


ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...

దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా

ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా

ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా

పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...

కాళిదాసులాగ మారి కవితే రాసేశా


ట్రిపుల్ ఎక్స్ రమ్ములోన కిక్కులేదు హల్లో మైనా

నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా

సన్‌లైట్ వేళ నుంచి మూన్‌లైట్ వేళ్లేదాకా

ఫుల్ టైమ్ నా గుండెల్లో ధాట్‌లన్నీ నీవేగా

ఓ లలనా ఇది నీ జాలమా

నీ వలన మనసే గాయమా

కుదురేమో లేదాయే నువు

నమ్మవుగాని కలవరమాయె

ఓ మగువా... ఓ మగువా... ఓ మగువా... ఏయ్

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...

దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా


కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని

నీ జంటే కోరుతుంటే దంచుతావె కారాన్ని

క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి

ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని

ఓ మగువా నీకే న్యాయమా

ఎదలో ప్రేమే శాపమా

మనసేమో బరువాయె...

నీ మాటలు లేక మోడైపోయె

మగువా... ఓ మగువా... ఓ మగువా...

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...

కాళిదాసులాగ మారి కవితే రాసేశా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...

దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా