చిత్రం: జర్నీ(2011)
రచన: సాహితి
గానం: సత్య
సంగీతం: సత్య
గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల ఎందుకొచ్చిందో ఏమి అవుతుందో.. అవుతుందో గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో అరె సుత్తి అన్న పేరు నేనీ సుందరికెడతారో కొంచెమైనా నమ్మని పిల్ల బంకలాగ పట్టిందిల్లా విడిచి పెట్టి పోయేదెల్లా ఏమి గొడవిదిరా అండపిండాబ్రహ్మాండాలా మొండిఘటమే తగిలిన వేళ గుండె మంటల గుడుగుంజాలా గోల ఇతడిదిరా సందింత దొరికిందా సందేహ పడుతుంది ఏ కొద్దిపాటి చిరుబురుకైనా చిన్నబోతుంది చీమంతా చిల్లరకే తెగ చిందులేస్తుంది రవ్వంత దానికి రోడ్డు మీద రచ్చలు చేస్తుంది అరెరెరె అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో సొగసరి బాపు బొమ్మ అన్న పేరీ ఈ గుమ్మకి పెడతారో అమ్మ బాబో నస అనుకుంటే ఎంత మంచి అమ్మాయల్లే చేతనైనా సాయం చేసే మనసు ఉన్నదిరా వింత స్నేహం వీరిది అవునో ఎంత కాలం కొనసాగేనో ఎప్పుడీ కథ ఏమయ్యేనో ఎవరికెరుకంట అబ్బాయి ఆ వైపు అమ్మాయి ఈ వైపు షేర్ ఆటోలో ఓ జర్నీలాగా సాగెలే లైఫు అతను తన చెంతకొచ్చిన అంత కోపం ఇప్పుడు లేదంటా తన వెంట వచ్చిన సందేహాలు టు నాట్ టు .. గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి