చిత్రం: మృగరాజు (2001)
రచన: వేటూరి
గానం: హరిహరన్, సాధన సర్గం
సంగీతం: మణి శర్మ
హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లె వంకజాబిల్లి వలపులు జల్లె కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా హలా హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లె వంకజాబిల్లి వలపులు జల్లె విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే కన్నానులే నీ కన్నుల్లోన కలలే కన్న సావాసమే కోకిలలా కిలకిలలే మన పూదోటలో తేనెలలా వెన్నెలలే వేసవి పూటలో ప్రాయమో గాయమో సుమశర స్వరజతిలోన హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల చూడాలని చలికాటే పడని చోటే ఇచ్చి చూడాలని చెప్పాలని నీ చూపే సోకని సోకే అప్పజెప్పాలని మరి పదవే విరిపొదకే చెలి మరియాదగా ఎద కడిగా ఎదురడిగా సిరి దోచెయ్యగా వీణవో జాణవో రతిముఖ సుఖశృతిలోన హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లె వంకజాబిల్లి వలపులు జల్లె కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా హలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి